25 ఇయర్స్ వరల్డ్ మ్యూజిక్ టూర్ సెలెబ్రేషన్స్ లో ఎం.ఎం. శ్రీ లేఖ

0
279

ఎం.ఎం శ్రీలేఖ ఆ పేరు వినగానే సంగీత ప్రియుల మనసు పులకించి పోతుంది. తను పాడే చక్కని పాటలతో సంగీత ప్రేమికుల మనసు గెలుచుకొంది ఎం.ఎం.శ్రీలేఖ. తన 9వ ఏటనే నే పద్యగానం చేసి ఆ తరువాత 12 సంవత్సరాల వయసులో అనగా 1994 లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన “నాన్నగారు” సినిమాతో సంగీత దర్శకులుగా పరిచయం అయ్యారు. ఆలా స్టార్ట్ అయిన తన జర్నీలో సురేష్ ప్రొడక్షన్ లో వచ్చిన తాజ్ మహల్ సినిమా తనకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తరువాత ఒక్క సురేష్ ప్రొడక్షన్ లోనే అత్యధికంగా 13 మ్యూజికల్ హిట్ సినిమాలకు సంగీతం అందించడం విశేషం. రీసెంట్ గా వచ్చిన హిట్ 2 లో ఎం.ఎం.శ్రీలేఖ సంగీతం అందించిన ‘ఉరికే ఉరికే..’ అనే రొమాంటిక్ సాంగ్ కు సిద్ శ్రీరామ్ అద్బుత‌మైన గొంతుతో పాడి ప్రేక్షకులకు మైమరపింపచేశాడు.ఇలా ఇప్పటివరకు తను 5 భాషల్లో 80 సినిమాలకు పైగా సంగీతం అందించిన ఏకైక మహిళా మ్యూజిక్ డైరెక్టర్ అని బుక్ అఫ్ స్టేట్ రికార్డ్ పేర్కొంది.సినిమా రంగంలొకి వచ్చిన తను ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా ఇండియా, ఖాతర్, యు. ఏ. ఈ, బహ్రెయిన్, కువైట్, ఒమన్, నార్వే, యు కె, ఐర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్ , స్వీడెన్, ఫిన్ ల్యాండ్, సౌత్ ఆఫ్రికా, టాంజానియా, నైజీరియా, యు యస్ ఏ, botswana, కెనడా, సింగపూర్, మలేసియా, హాంగ్ కాంగ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మొదలగు 25 దేశాల్లో 25 సింగర్స్ తో ఈ నెల 17 నుండి వరల్డ్ మ్యూజిక్ టూర్ ప్రోగ్రాం స్టార్ట్ చేయనున్నారు. అయితే గత నెలలోనే దర్శకులు రాజమౌళి గారు ఎం.ఎం. శ్రీ లేఖ వరల్డ్ మ్యూజిక్ టూర్ పోస్టర్ ను విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే.తాజాగా ఈ టీం అంతా నెల 17న బయలు దేరుతున్న సందర్బంగా హైదరాబాద్ లోని యఫ్.యన్. సి. సి కల్చరల్ సెంటర్ లో గ్రాండ్ గా సెలెబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన తెలంగాణ హనరాబుల్ హై కోర్ట్ జడ్జ్ నంద, ప్రముఖ దర్శకులు విజయేంద్ర ప్రసాద్, కమెడీయన్ ఆలీ, సంగీత దర్శకులు కోటి , దర్శకులు ముప్పల నేని శివ, చంద్ర మహేష్, వేణు శ్రీ రంగం. భారతీ బాబు, శైలేష్ కొలను, వై. వి యస్. చౌదరి, గేయ రచయిత చంద్ర బోస్, లిరిసిస్ట్ భాస్కరపట్ల, లక్ష్మీ భూపాల్ తదితరులు అందరూ పాల్గొని గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకున్నారు. అనంతరం

తెలంగాణ హనరాబుల్ హై కోర్ట్ జడ్జ్ నంద గారు మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీ లో గత 25 సంవత్సరాల నుండి సంగీత దర్శకురాలుగా తన కేరీర్ ను కొనసాగిస్తున్న ఏకైక మహిళ ఎం.ఎం.శ్రీ లేఖ కావడం చాలా సంతోషంగా ఉంది.అలాంటి తనను ఎప్రిసియేషన్ చేయడానికి ఈ అకేషన్ కు రావడం జరిగింది.తను ఇలాగే ఇంకా వచ్చే 25 సంవత్సరాలు కూడా తన సంగీతం తో ప్రేక్షకులకు అలరిస్తూ తన ప్రయాణం విజయవంతంగా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

ప్రముఖ దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. చిన్నప్పుడు నేను శ్రీ లేఖకు ఒక ఆశ చూపించాను.ఆ ఆశ కోసమే తను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యింది. ఆ తరువాత తను కష్టపడి ఎన్నో అద్భుతమైన పాటలతో ప్రేక్షకులను అలరించింది.ఇప్పుడు తన అన్న కీరవాణి మ్యూజిక్ లో ఆస్కార్ అందుకోబోతుండగా రాబోయే రెండు, మూడు సంవత్సరాలలో తన అన్న లాగే శ్రీ లేఖ కూడా మంచి మ్యూజిక్ చేసి ఆస్కార్ అంతటి అవార్డు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ..ఎం.ఎం. శ్రీ లేఖ మంచి మ్యూజిక్ కంపోజర్, మంచి సింగర్ అందుకే తనంటే నాకు చాలా ఇష్టం.తను చేస్తున్న 25 వరల్డ్ మ్యూజిక్ టూర్ బిగ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ ఆస్కార్ వరకు ఎదిగినందుకు చాలా సంతోషంగా ఉంది .ఇంతకుముందు మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ కు ఆస్కార్ రావాలని దేవుణ్ణి కోరుకున్నాను. తనకు వచ్చింది. ఇప్పుడు కీరవాణి, రాజమౌళి, చంద్ర బోస్ లకు కూడా ఆస్కార్ రావాలని కోరాను. మీ అందరూ ఆశీర్వాదములతో తెలుగు వారికి కూడా ఆస్కార్ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

ఎం.ఎం.శ్రీ లేఖ మాట్లాడుతూ నా 25 ఇయర్స్ సెలెబ్రేషన్స్ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు, మీడియాకు ధన్యవాదములు. మ్యూజిక్ డైరెక్టర్ కు ఎంత స్ట్రగుల్ ఉంటుందనేది నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిన తరువాత తెలిసింది. ఇప్పటికి నేను సక్సెస్ ఫుల్ గా మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నాను అంటే నన్ను కన్న తల్లి తండ్రులు, మా చిన్నాన్న విజయేంద్ర ప్రసాద్, డాక్టర్ రామకృష్ణ గార్లే ముఖ్య కారణం. నా 25 సంవత్సరాల ప్రయాణంలో నన్ను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదములు.ఈ రోజు నేను నా జర్నీలో ఇన్ని పాటలు పాడాను అంటే ఆది నా ఒక్కరి కష్టం కాదు. నాకు తోడుగా ఉన్న నా మ్యూజిషన్స్, సింగర్స్, లిరిక్ రైటర్స్ ది.. వారికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. నన్ను చిన్న పిల్ల అనుకోకుండా పెద్దలు దాసరి గారు, రామానాయుడు, ముప్పల నేని శివ, చంద్ర మహేష్ ఇలా అందరూ నాకు అవకాశం ఇవ్వడంతో నా ఈ జర్నీ విజయవంతంగా కొనసాగుతుంది.అలాగే నా ద్వారా చంద్ర బోస్ ఇండస్ట్రీకి పరిచయం అవ్వడం తనిప్పుడు ఆస్కార్ లెవల్లో మంచి గుర్తింపు సాధించడం చాలా హ్యాపీగా ఉంది. అందరూ అనుకుంటున్నట్లు నా ప్రయాణం హ్యాపీగా సాగలేదు.అందరిలాగే నేను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. నేను ఇప్పటి వరకు డబ్బుల కోసం, ఆస్తులు కూడ బెట్టడం కోసం పని చేయలేదు. నా ఆత్మ సంతృప్తి కోసమే పని చేశాను. కొన్ని సందర్భాల్లో నా సొంత డబ్బులు పెట్టి అవసరమైన మేరకు ఎక్విప్మెంట్స్ కొన్నాను. ఇప్పటికీ నేను రెంటెడ్ హౌస్ లోనే ఉన్నాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే నేను ఆస్తులు సంపాదించకపోయినా నా పాటలతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకొన్నందుకు చాలా సంతోషంగా ఉంది .నా అన్న రాజ మౌళి గారు ఆస్కార్ లో ఎంతో బిజీగా ఉన్నా నేను అడగ్గానే వచ్చి నా వరల్డ్ మ్యూజిక్ టూర్ పోస్టర్ ను లాంచ్ చేశారు వారికీ నా కృతజ్ఞతలు.నన్ను నమ్మి 25 దేశాలలో పాటలు పాడే అవకాశం ఇచ్చిన రవి కుమార్ మండ గారికి, శ్యామ్ బాబు గంధం గార్లకు ధన్యవాదములు అన్నారు.

కమెడీయాన్ ఆలీ మాట్లాడుతూ.. నేను చైల్డ్ ఆర్టిస్ట్ నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యి హీరో అవ్వడం జరిగింది.ఇప్పటి వరకు నేను తెలుగు తల్లి ఒడిలో 45 ఇయర్స్ గా సేదతీరుతున్న నన్ను ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదములు. ఇన్ని సంవత్సరాల నా జర్నీలో ఇప్పటివరకు నేను 1250 సినిమాలు చేశాను. నాలాగే ఎం.ఎం శ్రీ లేఖ కూడా చైల్డ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ లొకి అడుగుపెట్టింది ఎందుకంటే గ్రేట్ లెజెంట్ ప్రొడ్యూసర్ డా.డి.రామానాయుడు గారు ఒక చిన్న వయసులోనే మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకోవడం శ్రీ లేఖ అదృష్టం అని చెప్పవచ్చు.. తను ఇప్పుడు 25 ఇయర్స్ పూర్తి చేసుకొని మ్యూజిక్ వరల్డ్ టూర్ కు వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తన టూర్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

గేయ రచయిత చంద్ర బోస్ మాట్లాడుతూ..నా మొదటి పాటకు ఎం. ఎం శ్రీ లేఖ గారే మ్యూజిక్ కంపోజర్ గా చేశారు.నా గేయ రచన యాత్ర ఇంత దిగ్విజయంగా సాగడానికి తన పాత్ర ఎంతో ఉంది. ఇప్పుడు తను చేస్తున్న 25 ఇయర్స్ వరల్డ్ మ్యూజిక్ టూర్ కూడా దిగ్విజయంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

లిరిసిస్ట్ భాస్కర పట్ల మాట్లాడుతూ..ఒక మహిళ సినిమా రంగంలో సంగీత దర్శకురాలుగా గత 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా గొప్ప విషయం. తను ఇలాగే ఇంకా 25 సంవత్సరాలు కూడా నేటి ట్రెండ్ కు తగ్గట్టు మంచి మంచి మ్యూజిక్ చేస్తూ నేటి యువతకు ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

విడియో బైట్ ద్వారా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, తదితరులు ఎం.ఎం శ్రీ లేఖ చేసే 25 ఇయర్స్ వరల్డ్ మ్యూజిక్ టూర్ ప్రోగ్రాం సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతూ బెస్ట్ విషెష్ తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here