లండన్‌లో 65 గంటలపాటు నిర్విరామంగా సంగీత కచేరి చేసి గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో వీణాపాణి మ్యాస్ట్రోగా అవార్డు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అచ్చ తెలుగు ప్రముఖ సంగీత దర్శకునిగా అనేక తెలుగు సినిమాలకు సంగీతాన్ని అందించారు వీణాపాణి. శుక్రవారం తన చిన్నకుమార్తె స్వరమంజరి వివాహం పైలట్ పవన్‌కుమార్‌తో హైదరాబాద్‌లో రంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి ముచ్చటకు ప్రముఖ నటులు మురళీమోహన్, తనికెళ్లభరణి, ‘శుభలేఖ’ సుధాకార్, సుదర్శన్, వంశీ రామరాజుగ్లారతో పాటు రచయిత– దర్శకుడు– నిర్మాత జనార్ధన మహర్షి, ప్రముఖ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొని నూతనజంటను ఆశీర్వదించారు.




