మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ , 18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా “వినరో భాగ్యము విష్ణు కథ”.
Everyone’s 𝐒𝐔𝐏𝐑𝐄𝐌𝐄 Favourite 🔥@IamSaiDharamTej to grace the trailer launch event of #VinaroBhagyamuVishnuKatha on 𝐅𝐄𝐁 𝟕𝐭𝐡 @ 𝟓:𝟎𝟒 𝐏𝐌 ✨#SDTForVBVK #AlluAravind #BunnyVas @Kiran_Abbavaram @GA2Official @kashmira_9 @KishoreAbburu @chaitanmusic @adityamusic pic.twitter.com/u0nm40OWHN
— BA Raju's Team (@baraju_SuperHit) February 6, 2023
తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమాతో మురళి కిషోర్ అబ్బురు దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కిరణ్ సరసన కశ్మీర పర్ధేశీ నటిస్తోంది. ఇదివరకే ఈ చిత్రం నుండి రిలీజైన “వాసవసుహాస” “బంగారం” పాటలకు, అలానే ఈ చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ తరుణంలో ఈ సినిమా ట్రైలర్ ను లాంచ్ ఈవెంట్ ను నిర్వహించనుంది చిత్రబృందం.
వరుస అప్డేట్స్ కి అనూహ్య స్పందన లభించడంతో ఈ సినిమా ట్రైలర్ ను రేపు రిలీజ్ చేయనుంది చిత్ర బృందం. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హాజరు కానున్నారు. ఈ సినిమా ట్రైలర్ రేపు సాయంత్రం (ఫిబ్రవరి 7న) 5:04 నిమిషాలకు రిలీజ్ కానుంది. ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.



