విజయ్ దేవరకొండ – పరశురామ్ లతో దిల్ రాజు, శిరీష్ ల కొత్త సినిమా

0
164

“గీత గోవిందం” తో బ్లాక్ బస్టర్ సాధించిన హీరో విజయ్ దేవరకొండ – పరశురామ్ లు మరో సినిమా చేయబోతున్నారు. ఈ కొత్త చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ లు ఎస్.వి.సి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు.

సరికొత్త కథతో తెరకెక్కనున్న ఈ చిత్రంతో విజయ్ మొదటి సారి దిల్ రాజు, శిరీష్ ల ఎస్.వి.సి క్రియేషన్స్ బ్యానర్లో పని చేయనుండడంతో చిత్రం పై అంచనాలు నెలకొన్నాయి.

భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన విషయాలని ఈ రోజు అధికారికంగా ప్రకటించగా ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణుల మరియు ఇతర వివరాలని త్వరలోనే వెల్లడించనున్నారు.

రచన,దర్శకత్వం – పరశురామ్ పెట్ల
నిర్మాతలు : రాజు -శిరీష్
పి.ఆర్ వో : వంశీ కాక, జి ఎస్ కే మీడియా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here