పోస్ట్ ప్రొడక్షన్ దశలో ‘అగ్ని నక్షత్రం’

0
138

లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మరియు మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘అగ్ని నక్షత్రం’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఫస్ట్ టైమ్ ఫస్ట్ టైమ్ డా. మోహన్ బాబు, ఎవర్ ఛార్మింగ్ మంచు లక్ష్మీప్రసన్న కలిసి తెర పంచుకుంటున్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారు. మలయాళంలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన మలయాళ నటుడు సిద్దిక్, ప్రముఖ యువ హీరో విశ్వంత్, చైత్ర శుక్ల తో పాటు భారీ తారాగణం కీలక పాత్రలు పోషించారు.

వంశీ కృష్ణ మళ్ళ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి అచ్చు రాజామణి సంగీతం అందిస్తున్నారు. గోకుల్ భారతి కెమెరామెన్ గా, మధు రెడ్డి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఒక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అని, ఇంట్రస్టింగ్ ఫైట్స్ తో ఆకట్టుకుంటుందని డైరెక్టర్ వంశీ కృష్ణ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here