ఆర్.ఆర్.ఆర్. చిత్రంలోని ‘నాటు.. నాటు…’ గీతం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగం ఆస్కార్ పురస్కారానికి నామినేట్ కావడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. మన తెలుగు పాట ఆస్కార్ కోసం తుది బరిలో పోటీపడటం అందరికీ గర్వ కారణం. ఇంతటి ప్రాచుర్యం పొందేలా గీతాన్ని స్వరపరచిన శ్రీ ఎమ్.ఎమ్.కీరవాణి గారికి హృదయపూర్వక అభినందనలు. ‘నాటు.. నాటు…’ గీతం ఆస్కార్ అవార్డు దక్కించుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఆస్కార్ బరిలో మన చిత్రం నిలిచేలా చేసిన దర్శకుడు శ్రీ రాజమౌళి, హీరోలు శ్రీ రాం చరణ్, శ్రీ ఎన్టీఆర్, నిర్మాత శ్రీ డి.వి.వి.దానయ్య, గీత రచయిత శ్రీ చంద్రబోస్, గాయకులు శ్రీ రాహుల్ సిప్లిగంజ్, శ్రీ కాలభైరవ, ఇతర సాంకేతిక బృందానికి అభినందనలు.
(పవన్ కళ్యాణ్)
అధ్యక్షులు – జనసేన