-‘వీరసింహారెడ్డి’ పక్కా బ్లాక్ బస్టర్.. రాసిపెట్టుకోండి: మాస్ మొగుడు సాంగ్ లాంచింగ్ ఈవెంట్ లో దర్శకుడు గోపీచంద్ మలినేని

0
161

గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వీరసింహారెడ్డి’. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్రబృందం జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. ఎస్ థమన్ తన మాస్-అప్పీలింగ్  కంపోజిషన్లతో భారీ అంచనాలను నెలకొల్పాడు. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా నాలుగో సింగిల్ ‘మాస్ మొగుడు’ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.

బాలకృష్ణ, శ్రుతి హాసన్‌లపై థమన్ మాసీవ్,  ఎనర్జిటిక్ ట్రాక్‌ను అందించాడు. మనో, రమ్య బెహరా సూపర్ ఎనర్జిటిక్‌గా పాడారు . రామజోగయ్య శాస్త్రి సాహిత్యం బాలకృష్ణ పాత్ర గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఈ పాటలో బాలకృష్ణ లైవ్లీగా, గ్రేస్‌ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ మెస్మరైజ్ చేశారు. శృతి హాసన్, బాలకృష్ణ  గ్రేస్ కు తగ్గట్టుగా గ్లామరస్ గా కనిపించింది.

వైబ్రెంట్ సెట్స్‌లో ఈ పాటను చిత్రీకరించారు. విజువల్స్ కలర్‌ఫుల్‌గా కనిపించాయి. ఆఖరి విజువల్స్ లో పవన్ కళ్యాణ్ సెట్ లోకి రావడం కనిపించింది. గోపీచంద్ మలినేనికి వీరసింహా రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్. ఇప్పటికే థియేట్రికల్ ట్రైలర్‌తో ఆకట్టుకున్నాడు. ట్రైలర్ కు అన్ని వర్గాల నుండి  అద్భుతమైన స్పందన వచ్చింది.

గ్రాండ్ గా జరిగిన మాస్ మొగుడు సాంగ్ లాంచింగ్ ఈవెంట్ లో దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. వీరసింహారెడ్డి సెన్సార్ ఈ రోజు పూర్తయ్యింది. సెన్సార్ తర్వాత బ్లాక్ బస్టర్ అని కాల్స్ వచ్చేస్తున్నాయి. చాలా ఆనందంగా వుంది. ఒంగోలు ఈవెంట్ లో రిలీజ్ చేసిన థియేటర్ ట్రైలర్ కి ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. ఇది బాలయ్య బాబు మాస్ లా వుంటుందో జస్ట్ సాంపిల్ మాత్రమే సినిమాలో మాములుగా వుండదు. వీరసింహారెడ్డి ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్. రాసిపెట్టుకోండి. థియేటర్స్ అన్నీ ఒక వైబ్రేషన్ తో వుంటాయి. తమన్  ఎక్స్ ట్రార్డినరీ సాంగ్ ఇచ్చారు. బ్యాగ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవల్ లో ఇచ్చాడు.  బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి సినిమాని రెండోసారి చూస్తారు. ఇందులో అన్ని పాటలు రామజోగయ్య శాస్త్రి గారు రాశారు. ఇప్పుడు విన్న పాటలే కాకుండా బ్యాగ్రౌండ్ లో వచ్చే సాంగ్స్ రెడీ వున్నాయి. అవి ఇంకా ఎక్స్ ట్రార్డినరీ గా వుంటాయి. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి రాశారు. మాస్ మొగుడు చివర్లో తీసిన పాట. అప్పుడు మా కెమరామెన్ రిషి పంజాబీ డిఐ వర్క్ లో వుండటం వలన నా క్రాక్ సినిమా కెమరామెన్ జికె విష్ణు ఈ పాటని చేశారు. చాలా కలర్ ఫుల్ గా బాలయ్య బాబుని చాలా అందంగా చూపించాడు. రన్ టైం లో ఈ పాట వచ్చినపుడు మాములుగా వుండదు. ఈ సినిమాకి చాలా సక్సెస్ మీట్లు వుంటాయి. పండక్కి రాబోతున్న రెండు సినిమాలు పెద్ద విజయాలు సాధించాలని మెగాస్టార్ చిరంజీవి గారు మనస్పూర్తిగా కోరుకున్నారు.  చిరంజీవి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. వీరసింహా రెడ్డిలానే వాల్తేరు వీరయ్య పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. అన్నీ మా సినిమాలే. అన్ని సినిమాలు బావుండాలి. ఈ పండగ నెక్స్ట్ లెవల్ లో వుండాలి’’ అన్నారు

రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. వీరసింహారెడ్డి సింగిల్ కార్డ్ రాసే అవకాశం ఇచ్చిన దర్శకుడు గోపి చంద్ మలినేని కి , మైత్రీ మూవీ మేకర్స్ కి కృతజ్ఞతలు. ఈ నాలుగు పాటలే కాదు సినిమాలో వచ్చే మరో రెండు పాటలు కూడా అద్భుతంగా వుండబోతున్నాయి. అవి కథతో పాటు ట్రావెల్ అవుతాయి. వీరసింహారెడ్డి అద్భుతంగా వుంది. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కే కాదు.. తెలుగు ప్రేక్షకులందరికీ పండగ వాతావరణం క్రియేట్ చేసి బాలకృష్ణ గారి మార్క్ ఫైర్ బ్రాండ్ సినిమా ఇది. నేను బాలకృష్ణ గారికి అభిమానిని.  ఇందులో పాటలన్నీ రాయడం ఆనందాన్ని ఇచ్చింది. తమన్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. మీ అందరిలానే 12 వతేది కోసం ఎదురుచూస్తున్నాను’’ అన్నారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు, చిత్ర యూనిట్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here