హను రాఘవపూడి చేతుల మీదుగా ‘రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం’ టీజర్ విడుదల

0
229
కరోనా తరువాత ఆడియెన్స్ అభిప్రాయాలు మారిపోయాయి. సినిమాలను చూసే కోణం మారిపోయింది. చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేకుండా కంటెంట్ బాగుంటే.. కాన్సెప్ట్ కొత్తగా ఉంటే జనాలు థియేటర్లకు వస్తున్నారు. సినిమాలను ఆదరిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం అనే చిత్రం రాబోతోంది. వారధి క్రియేషన్స్ ప్రై.లి. బ్యానర్ మీద ఈ సినిమాను జైదీప్ విష్ణు దర్శకుడిగా తెరకెక్కిస్తున్నాడు.
ప్రవీణ్‌ కండెలా, శ్రీకాంత్ రాథోడ్, జయేత్రి మకానా, శివరామ్ రెడ్డి ఇలా నలభై మంది కొత్త నటీనటులతో రాబోతున్న ఈ చిత్రానికి సంతోష్ మురారికర్ కథ అందించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టీజర్‌ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హను రాఘవపూడి రిలీజ్ చేశారు. టీజర్ చూసిన అనంతరం బాగుందని ప్రశంసించారు. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.
రెండు నిమిషాలు 29 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌ సినిమా మీద ఆసక్తిని పెంచేసింది. ‘నా పేరు కుమార్.. ఇది నా ఊరు.. వెయ్యి అబద్దాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు.. కానీ మనం ఆడింది వందే’ అంటూ ప్రారంభమైన టీజర్ అందరిలోనూ ఓ ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. ‘వంద మంది.. బరా బర్ వంద మందిని చూపించాలి’.. ‘అన్నా ఇదంతా నిజంగా అయితదా?.. అయితది.. ఏం కావాల్నో అదే అయితది’.. ‘ఈ పని ఒక్కడే చేయగలడు సర్.. అయితే ఇదంతా మీకు తెలిసే జరుగుతాందా?’ అనే ఈ డైలాగ్స్‌తో సినిమా కథ ఏంటో చెప్పకనే చెప్పేశారు.

అసలు ఏం జరుగుతోంది.. ఆ వంద అబద్దాలు ఏంటి? ఆ వంద మంది కలిసి చేసిన పని ఏంటి?.. తుపాకుల గూడెంలో ఏం జరుగుతోంది? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తేలా సినిమా టీజర్‌ను యూనిట్ కట్ చేసింది. ఈ టీజర్‌లో శ్రీకాంత్ అర్పుల కెమెరాపనితనం అద్భుతంగా కనిపిస్తోంది. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన మణిశర్మ ఈ సినిమాకు పని చేయడం విశేషం. ఆయన మ్యూజిక్, ఆర్ఆర్ టీజర్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. జైదీప్ విష్ణు దర్శకుడు కూడా కావడంతో ఎక్కడ ఎలాంటి కట్స్ కావాలి..ఏ ఏ షాట్స్ ఉండాల్లో తెలుసు. కాబట్టి ఎడిటర్‌గానూ అద్భుతంగా ఈ టీజర్‌ను కట్ చేశారు జై దీప్ విష్ణు.
ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రం గణతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 26న థియేటర్లోకి రానుంది.

సాంకేతిక బృందం
డైరెక్టర్: జైదీప్ విష్ణు
బ్యానర్: వారధి క్రియేషన్స్ ప్రై.లి.
మ్యూజిక్: మణిశర్మ
DOP: శ్రీకాంత్ అర్పుల
ఎడిటింగ్: జైదీప్ విష్ణు
మార్కెటింగ్ కంపెనీ : బ్లాక్ స్పేస్ ప్రాజెక్ట్స్
PRO: సాయి సతీష్, పర్వతనేని

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here