రణస్థలి మూవీ రివ్యూ

0
782

సురెడ్డి విష్ణు సమర్పణలో ఏ.జె ప్రొడక్షన్ పతాకంపై అనుపమ సురెడ్డి నిర్మించిన చిత్రం ‘రణస్థలి’. పరశురామ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ధర్మ హీరోగా అమ్ము అభిరామి, చాందిని రావు.. లు హీరోయిన్లుగా ప్రశాంత్, శివ జామి, అశోక్ సంగా, నాగేంద్ర , విజయ్ రాగం.. కీలక పాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్ లతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ‘రణస్థలి’ మూవీ ఈరోజు అనగా నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం…

కథ :

బసవ (ధర్మ) అమ్ములు (చాందినీ రావు) ఇద్దరూ బావామరదళ్ళు. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న అమ్ములు.. బసవ ఇంట్లోనే పెరుగుతుంది. బసవ తండ్రి మున్నియ్య (సమ్మెట గాంధీ) వీరిద్దరికీ పెళ్లి చేస్తాడు. 6 నెలల్లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరాల్సిన బసవ.. అప్పటి వరకు ఖాళీగా ఉండకుండా.. చేసిన అప్పు తీర్చడం కోసం ఏదో ఒక పని చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అతను చక్రవర్తి (బెనర్జీ) అనే పెద్దమనిషి వద్ద పనికి చేరతాడు. అయితే ఒకరోజు చక్రవర్తి తోటలో పనిచేయడం కోసం నలుగురు పనివాళ్ళు వస్తారు. వీళ్ళకు బస ఏర్పాటు చేయమని చక్రవర్తి.. బసవ, అమ్ములకి చెబుతాడు. అయితే వచ్చింది పని వాళ్ళు కాదు మర్డర్లు చేసే కిరాయి గుండాలు. వాళ్ళ గురించి బసవకి తెలిసేలోపే.. చక్రవర్తిని, అమ్ములుని చంపేస్తారు? అసలు ఆ గుండాలు ఎందుకు చక్రవర్తిని, అమ్ముని చంపేశారు. వాళ్ళను ఎవరు పంపించారు. అసలు చక్రవర్తి ఎవరు? అనేది తెర పై చూడాల్సిన కథ.

నటీనటుల పనితీరు :

బసవ గా ధర్మ నటన గుర్తుంచుకోదగ్గ విధంగా ఉంది. పాత్రకు తగ్గట్టుగా బాగా నటించాడు. యాక్షన్ సన్నివేశాల్లో స్టార్ హీరోలా పెర్ఫార్మ్ చేశాడు. అమ్ములు పాత్ర చేసిన చాందినీ రావు చక్కని అభినయాన్ని కనబరిచింది. అమ్ము అభిరామి చాలా చక్కగా చేసింది. సమ్మెట గాంధీ హీరో తండ్రి పాత్రకు ప్రాణం పోశాడు. విలన్ గా చేసిన శివ కూడా టెరిఫిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. బెనర్జీ, చంద్ర శేఖర్, మధు మణి, శ్రీనివాస్ వెట్టి, ప్రశాంత్ పండు వంటి వారు తమ తమ పాత్రలకు తగ్గట్టుగా న్యాయం చేశారు.

టెక్నీకల్ టీం పనితీరు :

దర్శకుడు పరశురామ్ శ్రీనివాస్ ఒక స్టార్ హీరోకి సరిపోయే ఎలిమెంట్స్ తో కథను తయారు చేసుకున్నారు. తాను అనుకున్న పాయింట్ ను ఎంగేజింగ్ గా యాక్షన్ ఎపిసోడ్స్ తో చెప్పడంలో నూటికి నూరు శాతం సక్సెస్ సాధించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ను తీర్చిదిద్దిన విధానం, హీరో ఫ్రెండ్ కిడ్నాప్ ఎపిసోడ్ ఇతని దర్శకత్వ ప్రతిభ కు అద్దంపడుతాయి. థియేటర్లలో ఈ సీన్స్ కు విజిల్స్ పడుతున్నాయంటే ఆ సన్నివేశాలకు ఆడియెన్స్ ఎంత కనెక్ట్ అయ్యారో తెలుస్తోంది. అలాగే లాస్ట్ లో వచ్చే ట్విస్ట్ లు కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ క్లైమాక్స్. ఎక్కడా లాగ్ లేకుండా దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకుంటుంది.

ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ యాక్షన్ ఎపిసోడ్స్ ను తీర్చిదిద్దిన విధానం మెప్పిస్తుంది. కెమెరామెన్ జాస్టి బాలాజీ క్వాలిటీ విజువల్స్ తో మంచి ఔట్ పుట్ ఇచ్చాడు. కేశవ్ కిరణ్ సంగీతంలో పరశురాం శ్రీనివాస్ వ్రాసిన పాటలు అలాగే సన్నివేశాలను ఎలివేట్ చేసేలా బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ కూడా కంపోజ్ చేశారు. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా ఉన్నత నిర్మాణ విలువలు పాటించి నిర్మించారు. రన్ టైం కూడా 2 గంటల 20 నిమిషాలే ఉండడం సినిమాకు మరో ప్లస్ పాయింట్.

ప్లస్ పాయింట్స్:

హీరో ధర్మ నటన

పరశురామ్ శ్రీనివాస్ దర్శకత్వం

యాక్షన్ సీక్వెన్స్

క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడ పరిధి దాటిన వయోలెన్స్

విశ్లేషణ :

మాస్ ఆడియన్స్ ను యాక్షన్ ప్రియులను టార్గెట్ చేసి తీసిన సినిమా అవడం వలన రా అండ్ రస్టిక్ మేకింగ్ తో రియాలిస్టిక్ గా తీసిన మూవీ ఇది. అయినా మనసుకు హత్తుకునే ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళి సినిమా చూసి బయటకి వచ్చే ప్రేక్షకుడి కి మంచి కిక్ ఇస్తుంది.

రేటింగ్ : 3.5/5

చివరగా :  ఆద్యంతం అలరించే రా అండ్ రస్టిక్ ఎంటర్టైనర్ మూవీ ‘రణస్థలి’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here