‘‘మీ జీవితం ఒక వేడుకలా సాగింది. మీ నిష్క్రమణ అంతకన్నా వేడుకగా జరుగుతోంది. అదే మీ గొప్పతనం. మీరు మీ జీవితాన్ని నిర్భయంగా గడిపారు. డేరింగ్ అండ్ డాషింగ్ స్వభావం మీది.
నా స్ఫూర్తి, నా ధైర్యం నేను చూసినదంతా అలా వెళ్లిపోయాయి. కానీ విచిత్రంగా, నాలో ఇంతకు ముందెన్నడూలేని శక్తిని అనుభూతి చెందుతున్నాను. ఇప్పుడు నాకెలాంటి భయం లేదు.. మీ వెలుగు నాలో ఎప్పటికీ ప్రకాశిస్తుంది. మీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తాను. మిమ్మల్ని మరింత గర్వపడేలా చేస్తాను. లవ్ యూ నాన్నా.. మై సూపర్ స్టార్”
– సూపర్ స్టార్ మహేష్ బాబు