“ఉర్వశివో రాక్షసివో” సినిమా మా గీత ఆర్ట్స్ బ్యానర్ కే కాదు మా ఫ్యామిలీ అందరికీ వెరీ స్పెషల్ మూవీ.ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాలు రావచ్చు కానీ.. ఇది మాకు స్వీట్ మెమోరీగా గుర్తుండి పోయే స్పెషల్ మూవీ అన్నారు ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ జంటగా ‘విజేత’ సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీఏ-2 పిక్చర్స్ ధీరజ్ మొగిలినేని నిర్మించారు.అచ్చు రాజమణి సంగీతం అందించిన ఈ చిత్రానికి విజయ్ ఎం సహనిర్మాత గా వ్యవహారించారు. నవంబర్ 4న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.ఈ నేపధ్యంలో హైదరాబాద్ లో చిత్ర యూనిట్ గ్రాండ్ గా సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్, నిర్మాత దిల్ రాజు లు ముఖ్య అతిధిలుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా
ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ…ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్యూ సో మచ్. అందరికీ లైఫ్ ఇచ్చేది డైరెక్టర్. అందరూ బాగా చేసినా డైరెక్షన్ సరిగా చెయ్యకపోతే డెడ్ బాడీ కి డెకరేషన్ చేసినట్లుంటుంది. దర్శకుడు రాకేష్ గారు మాకు మంచి మెమోరబుల్ హిట్ సినిమా ఇచ్చాడు.. ముఖ్యంగా మా నాన్నకు బిగ్ కంగ్రాచులేషన్ చెప్పాలి. ఆయన నా సినిమాలు ఎన్నో చూశారు గాని, శిరీష్ సినిమా ను నిర్మించి శిరీష్ కు మంచి సక్సెస్ ను ఇవ్వడం అనేది తనకు చాలా మెమొరబుల్ గా ఉంటుంది. GA2 బ్యానర్ పెట్టిన మా బన్నీ వాసు చెప్పినట్టు నేను, వాసు, వాసు నేను అనేది వేరు కాదు మా ఇద్దరం ఒకటే.ఈ విషయంలో మా నాన్నకి ఎంత రేటింగ్ ఇస్తానో వాసుకు కూడా అంతే రేటింగ్ ఇస్తాను. తనెప్పుడూ నాగురించే ఆలోచిస్తుంటాడు. GA2 బ్యానర్లో ఎన్నో మంచి సినిమాలు చేసి పెద్ద విజయం సాదించాడు. తను ఇలాగే మంచి మంచి సినిమాలు తీసి సక్సెస్ చేయాలని కోరుతున్నాను. ఈ సినిమాకు పనిచేసిన టెక్నిషియన్ అందరూ చాలా బాగా వర్క్ చేశారు. కెమెరామెన్ పని తీరు, ఎడిటింగ్ పరంగా, మ్యూజిక్ పరంగా ఇలా అందరూ బాగా చేశారు వారందరికీ కంగ్రాచులేషన్. ఇందులో సునీల్, వెన్నెల కిషోర్ లు చాలా బాగా చేశారు.అను మంచి కథను ఎన్నుకుని సక్సెస్ అయింది. మా తమ్ముడు గురించి మాట్లాడాలి.నా సినిమా సక్సెస్ అయినా నేను ఇంత హ్యాపీగా ఉండేవాడిని కాదేమో.. మా తమ్ముడు సినిమా సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. శిరీష్ నువ్వు ఏం చేయక పోయినా పర్లేదు ఐ లవ్ యు.హిట్ కొట్టినా కొట్టక పోయినా నువ్వు నాకు ఆల్వేస్ సక్సెస్ పుల్. ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో శిరీష్ పర్ఫార్మెన్స్ బాగుందని చెప్తా ఉంటే చాలా హ్యాపీగా ఉంది. తను ఇలాగే మంచి, మంచి సినిమాలు చేసుకుంటూ పోవాలి. అందరూ పుష్ప గురించి అడుగుతున్నారు. వారికి చిన్న అప్ డేట్ ఇస్తాను. “పుష్ప” వన్ తగ్గేదే లే అయితే.. “పుష్ప 2” అస్సలు తగ్గేదేలే. నేను కూడా ఈ సినిమా కొరకు చాలా ఎగ్జైట్మెంట్ గా వెయిట్ చేస్తున్నాను అన్నారు.
నిర్మాత సమర్పకులు అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఆల్ ఇండియా స్టార్ గా ఎదిగిన మన బన్నీకి, ఇప్పుడిప్పుడే సక్సెస్ చూస్తూ ఒక స్టార్ గా ఎదుగుతున్న మన శిరీష్ కు వారిద్దరు ఇక్కడ కూర్చోవడం చూస్తుంటే ఇంతకన్నా ఆనందం నాకు ఏముంటుంది. వెన్నెల కిషోర్, సునీల్ చాలా చక్కగా నటించారు. నేను ఈ కథ విన్నప్పుడు అను అయితే బాగుంటుంది అని చెప్పడంతో సెలెక్ట్ చేస్తే తను బాగా నటించింది. రాకేష్ చేసిన సినిమా చూసి ఈ సినిమాకు అవకాశం ఇచ్చాను. అయితే ఈ సినిమా చాలా చక్కగా చేయడమే కాకుండా ప్రతి ఒక్క టెక్నీషియన్ తో చాలా డీసెంట్ గా వర్క్ చేయించు కున్నాడు.అందుకే ఈ రోజు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయ్యాడు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఈ రోజు బన్నీ ఐ కాన్ స్టార్ గా ఎదిగాడు అంటే తను ఎంతో కష్టపడ్డాడు. నేను గానీ, మా సంస్థ గానీ,బన్నీ, సుకుమార్ గానీ మేమంతా 20 ఇయర్స్ బ్యాక్ మా జర్నీ స్టార్ట్ అయినప్పుడు చిన్నచిన్న అడుగులు వేస్తూ ఆర్య సినిమా తీసి తెలుగు ఇండస్ట్రీలో స్ట్రెంత్ అయ్యి ఈరోజు మేమంతా పాన్ ఇండియా స్థాయికి వెళ్ళాము అంటే దానికి ముఖ్యకారకులు అరవింద్ గారు. వారు ఆర్య కథను ఓకే చేసీ మమ్మల్ని పిండి మాతో వర్క్ చేయించుకున్నాడు. కాబట్టే సినిమా ఆ రేంజ్ లో సక్సెస్ అయ్యింది. ఇప్పుడు కూడా అదే డెడికేషన్ తో వర్క్ చేయించు కోవడం గచూస్తుంటే తన ఓపికకు, తన ఎనర్జీకి బిగ్ థాంక్స్..ఈ రోజు క్యూట్ టైటిల్ పెట్టుకొని తెలుగు ప్రేక్షకుల మనసుల దగ్గరికి తీసుకెళ్ళిన టీం అందరికీ కంగ్రాట్స్. ఒక సినిమా సక్సెస్ చేయడానికి ఎంతో హార్డ్ వర్క్, విజన్, జడ్జిమెంట్ కావాలి.దాన్ని అరవింద్ గారి దగ్గర చూసి నేర్చుకుని బన్నీ వాసు కంటిన్యూ చేస్తున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది అన్నారు..
తమ్మా రెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. మా సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమా కోసం నటీ నటులు, టెక్నీషియన్స్ అందరూ ఫుల్ హార్డ్ వర్క్ చేశారు వారందరికీ థాంక్స్.ఈ సినిమా తియ్యడానికి ముఖ్య కారకుడు అరవింద్ గారు. నా దగ్గర కథ ఉన్నా సినిమాలు తీయడం అనవసరం. మానేద్దాం అనుకున్న టైంలో ఈ కథ బాగుంది. నిన్ను ప్రొడ్యూసర్ ను చేస్తాను అన్నాడు. వెళ్ళి పోతున్న నన్ను తీసుకువచ్చి హిట్ చేయించడమే కాకుండా మళ్ళీ సినిమా చెయ్యాలనే కోరిక కలిగించారు అరవింద్ గారు. వారికి థాంక్స్..శిరీష్, అను, రాకేష్, దీరజ్, బన్నీ వాసు లు పడిన కష్టానికి దగ్గ ఫలితం దక్కింది. అల్లు అర్జున్ ను చూస్తుంటే సినిమా సినిమాకు అందనంత ఎత్తుకు ఎదుగు తున్నాడు.శిరీష్ కూడా తన లాగే ఎదగాలని కోరుకుంటున్నాను. ఆ మధ్య 2020 లో పలాస చేసీ సక్సెస్ చేశాను. మళ్ళీ ఈ సినిమాతో ధైర్యం ఇచ్చినందుకు ప్రేక్షకులకు థాంక్స్ చెపుతున్నాను అన్నారు.
చిత్ర హీరో అల్లు శిరీష్ మాట్లాడుతూ..ఇక్కడకు వచ్చిన మా అన్నయ్య ఆర్మీ కి, వచ్చిన వారందరికీ థాంక్యు వెరీ మచ్, మీ సపోర్ట్ అనేది మాకు ధైర్యం ప్రతి ఈవెంట్ నువ్వు వచ్చి చేసినందుకు థాంక్స్.ఈ సినిమాకు అందరూ చాలా కష్టపడ్డాము. అందుకే సినిమా బాగా వచ్చింది. దర్శకుడు రాకేష్ గారు నాకు చాలా చక్కని సినిమా ఇచ్చారు. తనతో వర్క్ చేయడం హ్యాపీ గా ఉంది. ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉన్న సునీల్ గారు, వెన్నెల కిషోర్ గార్లతో ఈ సినిమాలో పని చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సెట్లో వీరి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. నా కో స్టార్ అను చాలా బాగా చేసింది. ఈ సినిమా ప్రి రిలీజ్ లో ఇప్పటివరకు అనును స్టార్ హీరోయిన్ గా చూశారు కానీ ఈ సినిమా తర్వాత మంచి ఆర్టిస్ట్ గా చూస్తారు అన్నాను. అది నాకు కొంచెం ఓవర్ గా చెప్పానా అని అనిపించింది. అయితే ఇందులో అను పర్ఫార్మెన్స్ చాలా బాగుందని అందరూ చెబుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది.ఇలాంటి మంచి సినిమా ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ తమ్మారెడ్డి భరద్వజ గారికి, దీరజ్, విజయ్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి.
ముఖ్యంగా మా ఫాదర్ అల్లు అరవింద్ గారి గురించి చెప్పాలి.ఏ రిలేషన్ షిప్ లోనైనా కానీ గివ్ & టేక్ ఉంటుంది.నాకు మాత్రం మా నాన్న ఇప్పటివరకు ఇస్తూ ఇస్తూ ఇస్తూనే..ఉన్నాడు. ఏం చేసినా.. ఏం సాధించినా ఆయన రుణం మాత్రం తీసుకోలేను. అరవింద్ గారి అబ్బాయిగా పుట్టడం నా అదృష్టం. మా డాడీ నాకు లైఫ్ లో చాలా వరాలు ఇచ్చాడు.అందుకు మా నాన్నకు ధన్యవాదాలు. మా అన్నయ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి మాట్లాడాలంటే మా అన్నయ్య నన్ను కేవలం ఒక తమ్ముడులా చూడకుండా ఒక కొడుకులా చూస్తాడు. మా అన్నకు నేనంటే అంత ప్రేమ. బన్నీకి తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం. అలాగే అందరూ ఎదురు చూస్తున్నట్టు 2023 లో వచ్చే పుష్ప మాత్రం బాక్స్ బద్దలై పోతుంది మరొకసారి దేశానికి తెలుగు సినిమా స్థాయి ఏంటో చూపిస్తుంది అన్నారు.
బన్నీవాసు మాట్లాడుతూ..మా ఏఏ ఫాన్స్, ఆర్మీ అందరూ వచ్చి మాకు ఎనర్జీ నింపుతున్న వారందరికీ ధన్యవాదాలు. GA2 బ్యానర్ అనేది యంగ్ స్టర్స్ కు, టాలెంట్ ఉన్న పీపుల్స్ ఒక ప్లాట్ ఫామ్ గా ఉండాలని పెట్టాము.గీతా ఆర్ట్స్ అనేది పెద్ద సంస్థ పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంది.కాబట్టి ఈ GA2 లో ఒక కాన్సెప్ట్ సినిమాలకే కాకుండా ఎవరికైనా ఇది ఓపెన్ ప్లాట్ ఫామ్ లో వారి ట్యాలెంట్ ను నిరూపించుకునే వారికోసం ఈ సంస్థ ను తీసుకురావడం జరిగింది ఈ సంస్థ లో అనేకమైన విజయవంతమైన చిత్రాలు నిర్మించడం జరిగింది.ఈ సంస్థ చాలా మంది కొత్త వాళ్లకి లైఫ్ ఇచ్చాము. ఇప్పుడు వచ్చిన ఈ సినిమాలో కూడా నిర్మాత దీరజ్ తో పాటు ఎంతో మంది కొత్త వాళ్లకు అవకాశం కల్పించింది. అందుకు అరవింద్ గారికి మేమంతా ఋణపడి ఉంటాము. అరవింద్ గారు 70 ఏళ్ల వయసులో కూడా యంగ్ స్టర్ లా తను నిద్ర పోకుండా మమ్మల్ని నిద్ర పోనీకుండా మాతో వర్క్ చేయించుకుంటాడు.ఆలా చేస్తున్నారు కాబట్టే అయన ప్రాజెక్ట్స్ అన్నీ హిట్ అవుతున్నాయి. అలాగే ఈరోజు నేను ఈ స్టేజి మీద ఉన్నాను అంటే దానికి కారణం నా ప్రాణం, స్నేహం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. నన్నెవరైనా ఎంత సంపాందించావు అంటే చాలా సంపాందించాను అంటా ఎందుకంటే బన్నీ సంపాందించింది అంతా నాదే అనుకుంటా..కాబట్టి అలాగే జీవితంలో ఎంత ఎదిగావు అంటే చాలా ఎదిగాను అంటా.. బన్నీ గారు ఎంత ఎదిగితే ఆయనతో పాటు నేను ఎదిగినట్లే.. అందరూ పుష్ప అప్ డేట్ అడుగుతున్నారు. 2023 లో వస్తున్న పుష్ప 2 స్క్రీన్లు పగిలిపోబోతున్నాయి ఇది రాసిపెట్టుకోండి అన్నారు.
చిత్ర నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ..ఈ జర్నీ మొత్తం సపోర్ట్ చేసిన అరవింద్ గారికి వాసు గారికి ఇద్దరికీ రుణపడి ఉంటాను. మా హీరో అల్లు శిరీష్ తూ అను ఇమ్మానియేల్ కు దర్శకుడు రాకేష్ కు అందరికీ థాంక్స్. మా సినిమా చూసి ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియన్స్ అందరికీ స్పెషల్ థాంక్స్ అన్నారు.
చిత్ర దర్శకుడు రాకేష్ మాట్లాడుతూ..ఇక్కడకు వచ్చిన బన్నీ గారి ఆర్మీకి, శిరీష్ గారి అభిమానులకు ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. మాకెప్పుడూ ఎనర్జీ అవసరమైన బన్నీ అనే పేరు మాకు ఫుల్ ఎనర్జీని ఇస్తుంది. మా ఈవెంట్ కు రావడం చాలా ఆనందంగా ఉంది. అల్లు శిరీష గారు గొప్ప సక్సెస్ కొడితే చూడాలనే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారందరికీ ఈ సినిమాను డెడికేట్ చేస్తున్నాను. ఈరోజు ఈ సినిమా చూసిన వారంతా ఎంజాయ్ చేస్తున్నారు అంటే అది నా ఒక్కడి వల్ల కాదు, మ్యూజిక్, కెమెరామెన్,ఆర్ట్, ఎడిటింగ్, డైరెక్షన్, డిపార్ట్మెంట్ ఇలా టోటల్ టీం వర్క్. అరవింద్ గారి మీదున్న రెస్పెక్ట్ తో అనూప్ గారు తక్కువ టైం లో మాయరే వంటి మంచి సాంగ్ ఇచ్చారు. సునీల్ వెన్నెల కిషోర్ వీరిద్దరూ యాక్టింగ్ తో సినిమాను వేరే లెవెల్ కి తీసుకెళ్లారు.ఆమని గారు, కేదార్, చిన్న ఆర్టిస్ట్ అయినా వచ్చి చేసిన ఇలా ప్రతి ఒక్కరు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. అను ఇమ్యాన్యూయేల్ ని మాములుగా చూస్తేనే ఊర్వశి లా కనిపిస్తుంది. కానీ రాక్షసి అనే పదానికి కూడా ఊర్వశిలా అందంగా ప్రజెంట్ చేసింది. అల్లు శిరీష్ ఇందులో చాలా న్యాచురల్ గా పర్ఫార్మెన్స్ చేశాడు. ధీరజ్, తమ్మారెడ్డి భరద్వాజ విజయ్ గార్లు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు వారికి థాంక్స్. మా అందరికీ బ్యాక్ బోన్ గా ఉండి మమ్మల్ని నడిపించిన వ్యక్తి బన్నీ వాసుగారు నుంచి మేము చాలా నేర్చుకున్నాము. ఈ సినిమా సక్సెస్ లో ఆయన పాత్ర ఎంత అనేది మాకు మాత్రమే తెలుసు. అల్లు అరవింద్ గారి తో సినిమా చేయడం అనేది ప్రతి డైరెక్టర్ కల. నాకు ఆలాంటి అవకాశంతో పాటు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. అందుకే సినిమా బాగా ఇలా తీయగలిగాను. కాబట్టి అల్లు అరవింద్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను అన్నారు.
హీరోయిన్ అను ఇమ్మాన్యూల్ మాట్లాడుతూ..మై ఆల్ టైం ఫేవరేట్ బన్ని గారు మా ఫంక్షన్ కి రావడం చాలా ఆనందంగా ఉంది. ఊర్వశివో రాక్షశివో ఒక టిపికల్ రొమాంటిక్ కామెడీ కాదు.ఒక ఫ్రెస్ ప్రాస్పెక్టివ్ లవ్, మ్యారేజ్, రిలేషన్ షిప్.ఈ సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డాము. తెలుగు ప్రేక్షకులను నేను కోరుకునేది ఒకటే మీ ప్రేమ, మీ సపోర్టు ఇలాగే మాకెప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దర్శకుడు రాకేష్ గారు వర్క్ లో కాంప్రమైజ్ కాకుండా మాతో నటనను రాబట్టుకున్నాడు. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన, అల్లు అరవింద్ గారికి, బన్నీ వాసుకు, దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
నిర్మాత ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ.. ఒక తుఫాను, ఒక సముద్రం, ఒక ఆకాశం కలిస్తేనే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. “ఊర్వశివో రాక్షసివో” సినిమా ద్వారా శిరీష్ కు పెద్ద హిట్ రావడం చాలా సంతోషంగా ఉంది.నేను ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను అంటే దానికి శిరీష్ కారణం.చాలామంది ఔత్సాహికులకు, టాలెంటెడ్ పర్సన్స్ కు లిఫ్ట్ ఇస్తుంటాడు.గిఫ్ట్ ఇస్తుంటాడు. ఈ సినిమా సమర్పకులు అరవింద్ గారిది గోల్డెన్ హ్యాండ్.ఆయన ఖాతాలో మరో విజయం వచ్చింది. ఆయన నిర్మిస్తే తెలుగు సినిమాలే కాదు తమిళ్,కన్నడ వంటి డబ్బింగ్ సినిమాలు కూడా కోట్లు కొల్లగొడతాయి అన్నదానికి నిదర్శనమే “కాంతారా”.సినిమా. ఇలాంటి హిట్ సినిమా ఇచ్చిన ల్యాండ్మార్క్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారికి ధన్యవాదాలు.నా మిత్రుడు ధీరజ్ కు తొలి సినిమా తోనే పెద్ద హిట్ సాధించాడు తనకి కంగ్రాట్స్.గత మూడు సంవత్సరాల నుండి కష్టపడుతున్న రాకేష్ కు మంచి సక్సెస్ వచ్చింది.మమ్మల్ని ముందుండి నడిపించే బన్నీ వాసుకి కృతజ్ఞతలు. తన తమ్ముడు చిత్రానికే కాదు ఇండస్ట్రీ లో ఏ తమ్ముడు చిత్రానికైనా వచ్చే అన్నయ్య ఐకాన్ అల్లు అర్జున్. ఒక చోట ట్యాలెంట్ ఉంది అంటే ఆ సినిమానైనా, ఆ వ్యక్తి నైనా ప్రోత్సహించే వ్యక్తి, ఒక శక్తి ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. అయ్యన్ను స్టైలిష్ స్టార్ గా పిలుద్దామంటే ఆ స్థాయిని దాటేశారు.సధరన్ స్టార్ అని పిలుద్దామంటే గ్లోబల్ రేంజ్ కు వెళ్లిపోయారు.ఐ కాన్ స్టార్ అని పిలుద్దామంటే ఒక క్రికెట్ మ్యాచ్ ను చూద్దాం.. అన్నా అయన గెశ్చర్శే, ఏ ఇంటర్నెట్ చూసినా అయన గెశ్చర్శే, అయన తగ్గేదే..లే అని ఎపుడైతే అన్నారో ప్రపంచ వ్యాప్తంగా తగ్గేదే..లే అనే పదం ఒక ఐకాన్ గా మారిపోయింది. అలాంటి సిగ్నేచర్స్ కనిపెట్టే ఆయన పుష్ప 2 తో ఖండ ఖండాలు దాటి అఖండంగా అప్రహిత జైత్రయాత్ర కొనసాగించబోతున్నారు వారికి ఆల్ ద బెస్ట్. అలాగే ఇప్పటి వరకు శిరీష్ చేసిన సినిమాలకు హిట్ అయితే పొంగిపోడు, ఫ్లాప్ వస్తే కుంగిపోడు, ఏదైనా టఫ్ టైమ్ వస్తే లొంగిపోడు.కాబట్టి తను ఇంకా ఎన్నో మంచి సినిమాలు చెయ్యాలని అన్నారు.
నటుడు సునీల్ మాట్లాడుతూ.. గీతా ఆర్ట్స్ ని భగవద్గీతలో భగవంతుడు గీతను ఎంత నీట్ గా పక్కనుండి నడిపించాడో అలా గీతా ఆర్ట్స్ ను ఆలా ముందుకు నడిపిస్తూ ఉంటాడు.ఎందుకంటే కొన్ని లక్షల మందికి ఫుడ్ పెట్టిన సంస్థ అది.నేను టికెట్ కొనుక్కుని చూసి ఈ రోజున వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని చేస్తున్నందుకు హ్యాపీ గా ఉంది. శిరీష లో అన్ని రకాల వేరియేషన్స్ ఉన్నాయి.ఈ సినిమాలో నేను చాలా రోజుల తర్వాత కామెడీ క్యారెక్టర్ చేశాను. దాంతో అందరూ పాత సునీల్ ను చూశాము అంటుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి, దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
సినిమా పేరు: “ఊర్వశివో రాక్షసివో”
హీరో: అల్లు శిరీష్
హీరోయిన్: అను ఇమాన్యుయేల్
దర్శకుడు: రాకేష్ శశి
సంగీత దర్శకుడు: అచ్చు రాజమణి
నిర్మాత: ధీరజ్ మొగిలినేని
బ్యానర్ పేరు: GA2 పిక్చర్స్
సమర్పకులు: అల్లు అరవింద్
సహ నిర్మాత విజయ్ ఎం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – బాబు గారు
DOP- తన్వీర్
ఎడిటర్ – కార్తీక శ్రీనివాస్
PRO: ఏలూరుశ్రీను , మేఘశ్యామ్