టైటిల్‌కు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు.. తగ్గేదేలే సినిమాపై డైరెక్టర్ శ్రీనివాస్ రాజు

0
314
సీట్ ఎడ్జ్ మూమెంట్స్‌తో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ‘తగ్గేదే లే’. భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. యువ కథనాాయకుడు నవీన్ చంద్ర లీడ్ రోల్‌లో న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని ‘దండుపాళ్యం’ ఫేమ్ శ్రీనివాస్ రాజు తెరకెక్కిస్తుున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌, ఇంట్రెస్టింగ్ టీజ‌ర్‌, నైనా గంగూలీ నర్తించిన స్పెషల్ సాంగ్‌కి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ట్రైలర్‌తో సినిమాపై ఉన్న ఆసక్తి మరింతగా పెరిగింది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు శ్రీనివాస్ రాజు మీడియాతో ముచ్చటించారు.
– త్వరగా సినిమాను పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో మర్డర్ మిస్టరీని ఎంచుకున్నా. ఈ తరహా కథలను కరోనా సమయంలో అందరూ చూశారు. ఏ సినిమా కథ అయినా కూడా లవ్, లస్ట్, వెంజైన్స్ మీదే రన్ అవుతుంటాయి. దండుపాళ్యం సినిమాను కరోనా సమయంలో చాలా మంది చూసి ఫోన్‌లు చేశారు. ఈ కథలో వెంజైన్స్ ఉంటుంది. అయితే ఈ సినిమాకు టైటిల్ ముందుగా ఏదీ అనుకోలేదు. కానీ కరోనా సమయంలో తగ్గేదేలే అనే పదం ఎక్కువగా పాపులర్ అయింది. ఈ కథలో కూడా తగ్గేదేలే అన్నట్టుగా పాత్రలుంటాయి. అందుకే ఈ టైటిల్ పెట్టాం. అయితే టైటిల్ ఇంత వైరల్ అవుతుందని, రెస్పాన్స్ వస్తుందని మేం అప్పుడు అనుకోలేదు.
– ఈ సినిమా నిడివి దాదాపు రెండు గంటల పదిహేను నిమిషాలుంటుంది. అందులో సగానికి పైగా లవ్ స్టోరీ ఉంటుంది. దండుపాళ్యం గ్యాంగ్ అందరితో కలిసి ఓ పెద్ద ఈవెంట్ చేద్దామని అనుకున్నాను. ఈ గ్యాంగ్ అందరితో కలిసి మళ్లీ సినిమా చేయాలని అనుకున్నాను. నా వద్ద మూడు సీజన్లకు సరిపడా కథ ఉంది. కానీ నాకు ఇప్పుడు ప్రేమ కథలు చేయాలని ఉంది. ఎప్పుడూ ఒకే రకమైన జానర్‌లో ఉన్న సినిమాలను చేయాలనుకోవడం లేదు. ఇప్పుడు మంచి ప్రేమ కథలు తీయాలని అనుకుంటున్నాను. అయితే దండుపాళ్యం గ్యాంగ్ అంతా కూడా ఇందులో అనుకోకుండా వచ్చేసింది.
– తెలిసిన కథనే కొత్తగా చెప్పాలని అనుకుంటున్నాను. చాలా సింపుల్‌గా చెప్పాలని అనుకున్నాను. మెదడు మీద ఒత్తిడి ఉండదు. అలా చూస్తుండిపోయేలా ఉంటుంది.
– మనిషి నమ్మకాన్ని స్వామిజీలు వాడుకుంటున్నారు. అసలు ఇప్పుడు స్వామిజీలంటూ ఎవ్వరూ లేరు. ఆధ్యాత్మికం అనేది ఇప్పుడు వ్యాపారంగా మారింది. మనం ఎలా ఉండాలి అని భగవద్గీతలో ఉంటుంది. స్వామిజీ ముసుగులో జరిగే వాటిని ఇందులో చెప్పాం. అక్కడే ఎక్కువగా మనీలాండరింగ్ జరుగుతుంది. నాగబాబు గారు చెప్పే ఆ సీన్ బాగుంటుంది.
– నవీన్ చంద్రకు కథ బాగా నచ్చింది. ఆయనది లవ్ స్టోరీ మాత్రమే. నేను ఆయనకు పాయింట్స్ రూపంలోనే చెప్పాను. చాలా సింపుల్‌గా ఉందని, చేద్దామని వెంటనే ఓకే చెప్పారు.
– ప్రేక్షకులు అనుకుంటేనే, వారికి నచ్చితేనే సినిమాలు చూస్తారు. సినిమా అంటే వినోదం మాత్రమే. హీరోకి ఉండే డెమీ గాడ్ ఇమేజ్ ఇప్పుడు పోతోంది. ఒరిజినల్ సినిమా అంటే.. ఇప్పుడు కాంతారా అందరినీ ఆకట్టుకుంది. ఆడియెన్స్ ఊహించని విధంగా సినిమా ఉంటేనే ఆదరణ దక్కుతుంది. లిప్ లాక్స్ సీన్స్ పెట్టినంత మాత్రాన ప్రేక్షకులు థియేటర్లకు రారు.
– దండుపాళ్యం తరువాత నేను చాలా మంది హీరోలను కన్విన్స్ చేసేందుకు వెళ్లాను. కానీ నేను ఎక్కడా కూడా కన్విన్స్ అవ్వలేదు. చివరకు నాకు ఈ చాన్స్ వచ్చింది. నేను చేసే ఏ సీన్ అయినా కూడా ఎక్కడి నుంచి స్పూర్తి పొందలేదు. లవ్ స్టోరీని ఎంతో ఎంటర్టైన్మెంట్‌గా చూపించాం. దర్శకుడిగా ఎప్పుడూ మనం సంతృప్తిపొందలేం.
– నా ప్రతీ సినిమాలో యాక్టర్స్ కంటిన్యూ అవుతూనే ఉంటారు. నేను లవ్ స్టోరీస్ ఎక్కువగా తీస్తాను. దర్శకుడిగా నేను నా స్క్రిప్ట్ విషయంలో వెనకడుగు వేయను. వెంటవెంటనే సినిమాలు చేయాలనే ఉద్దేశ్యం లేదు. చేసిన ఒక్క సినిమాను మనసు పెట్టి చేయాలని అనుకుంటున్నాను.
– దండుపాళ్యం మొదటి పార్ట్ కన్నడ సినిమానే. అది ఆ రోజుల్లోనే 36 కోట్లు కలెక్ట్ చేసింది. వంద రోజులు ఆడింది. కేజీయఫ్‌ రేంజ్‌లో కలెక్షన్లు వచ్చినట్టు. దండుపాళ్యం లాంటి హిట్ మళ్లీ ఇంత వరకు రాలేదు. కన్నడ సినిమా ఎప్పటి నుంచో మూలాలా మీద ఆధారపడే ఉంది. కాంతారా సినిమాను ఇక్కడ హీరోలకు చెప్పి ఒప్పించలేరు. దండుపాళ్యం సినిమాను కూడా ఇక్కడా ఎవ్వరూ అంగీకరించరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here