‘రుద్రవీణ’ రివ్యూ

0
183

రుద్రవీణ

విడుదల తేదీ: 28-10-2020

నటీనటులు : శ్రీరామ్ నిమ్మల,ఎల్సా, శుభశ్రీ , రఘు కుంచే (విలన్) చలాకి చంటి,సోనియా, రమణారెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మహావీర్

డి ఓ పి : జి ఎల్ బాబు

ఎడిటర్ : నాగేశ్వర్ రెడ్డి

ఫైట్ మాస్టర్ : రియల్ సతీష్

కొరియోగ్రాఫర్ : మోహిన్,పైడిరాజు

లైన్ ప్రొడ్యూసర్ : శ్రీను రాగుల

నిర్మాత : లక్ష్మణ రావు రాగుల

డైరెక్టర్ : మధుసూదన్ రెడ్డి

రాగుల గౌరమ్మ సమర్పణలో సాయి విల సినిమాస్ పతాకంపై శ్రీరామ్, ఎల్సా, శుభశ్రీ  హీరో హీరోయిన్లు గా మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీనులు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “రుద్రవీణ’. ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. 28 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం.

కథ

యానాం సిటీలో లాలప్ప (రఘు కుంచె) తన తమ్ముల్లు, ముత్తప్ప, కన్నప్ప లతో కలసి చాపల బిజినెస్ ముసుగులో , డ్రగ్స్, మర్డర్స్, మానభంగాలు చేస్తూ పెద్ద రౌడీ గా చెలామని అవుతుంటాడు. అదే యానాంలో ఒక వైపు రుద్ర (శ్రీ రామ్ నిమ్మల) చిన్న పిల్లలకు క్రికెట్ నేర్పిస్తూ మరో వైపు లాలప్ప అనుచరులను రుద్ర చంపుతుంటాడు. తన మనుషులను ఎవరు ఎందుకు చంపుతున్నారో తెలియక లాలప్ప ఊరంతా గాలిస్తుంటాడు. జీవ హింస పాపం అంటూ ఆర్గాన్ డొనేషన్ గురించి ప్రచారం చేసే  ప్రియ (ఎల్సా)ను చూసిన రుద్ర మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. లాలప్ప తనవాళ్లను చంపినవాడి కోసం ఎంక్వయిరీ చేస్తుండగానే రుద్ర తన ఇద్దరు తమ్ముళ్ళని చంపేస్తాడు. మరో వైపు జైల్లో ఉండే వీణ (శుభశ్రీ ) కు ఉరిశిక్ష విధిస్తారు. వీణ ఎవరు ? రుద్ర లాలప్ప మనుషులను ఎందుకు మర్డర్ చేస్తుంటాడు ? రుద్ర కు వీణ కు సంబంధం ఏంటి ? అనేదే ఈ రుద్రవీణ కథ.

నటీ నటుల పనితీరు

రుద్ర గా శ్రీ రామ్ నిమ్మల మాస్, క్లాస్ రెండు షేడ్స్ వున్న పాత్రలో చక్కగా నటిస్తూ పాత్రలో ఒదిగిపోయాడు. ఎమోషనల్ క్యారెక్టర్ లో అవసరమైన చోట తగినట్లుగా నటించి పాత్రను బాగా క్యారీ చేసాడు. లాలప్ప గా రఘుకుంచె ముఖంపై గాటు తో, డిఫరెంట్ లుక్ లో తన పెర్ఫార్మన్స్ తో అద్భుతమైన విలనిజం పండించాడు. ఎల్సా (ప్రియ) తన లుక్స్ తో పాటు రొమాంటిక్ సీన్స్ లలో యూత్ ను ఆకట్టుకునే విధంగా నటించింది. స్క్రీన్ పై రుద్ర, ప్రియ ల కెమిస్ట్రీ బాగా పండింది. వీణ పాత్రలో శుభ శ్రీ అద్భుతంగా నటించింది. మరో నటి సోనియా లేడీ విలన్ గా బాగా పెర్ఫార్మ్ చేసింది. చలాకి చంటి, గెటప్ శ్రీను, జబర్దస్త్ బ్యాచ్ ఇలా ఇందులో నటించిన వారంతా తమ నటనతో పాత్రల పరిధి మేర ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణుల పనితీరు

ఎమోషనల్ రివెంజ్ డ్రామా ను లవ్, రొమాంటిక్, కామెడీ ఎలిమెంట్స్ తో దర్శకుడు మధుసూదన్ రెడ్డి సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉండేలా తెరకెక్కించాడు. సంగీత దర్శకుడు మహావీర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. వినసొంపైన పాటలతో పాటూ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా కంపోజ్ చేసారు. సినిమాటోగ్రాఫర్ జి ఎల్ బాబు విజువల్స్ బాగున్నాయి. ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ అందించిన ఫైట్స్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి. నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ పనితీరు బాగుంది. సాయి విల సినిమాస్ పతాకంపై నిర్మాతలు రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీనులు ఖర్చుకు వెనకాడకుండా నిర్మించిన ఈ చిత్రంలో నిర్మాణ విలువలు క్వాలిటీ గా ఉన్నాయ్. ఫ్యామిలీ తో అందరూ చూసే విధంగా తెరకెక్కించారు. అక్కడక్కడా కాస్త నెమ్మదించినా అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఇంటరెస్టింగ్ గా సాగిపోయే “రుద్రవీణ’ సినిమా అన్ని వర్గాల వారిని ఎంట‌ర్ టైన్ చేస్తుంది అని చెప్పవచ్చు.

చివరగా : ఆకట్టుకునే లవ్ & యాక్షన్ ఎంటర్ టైనర్

రేటింగ్: 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here