రుద్రంగి’ చిత్రంలో జ్వాలాబాయి దొరసానిగా ఆకట్టుకుంటున్న మమతా మోహన్ దాస్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల

0
183

ఎం.ఎల్.ఏ, శ్రీ రసమయి బాలకిషన్, రసమయి ఫిలిమ్స్ బ్యానర్ లో భారీ స్థాయిలో నిర్మిస్తున్న సినిమా ‘రుద్రంగి’. రాజన్న, బాహుబలి, బాహుబలి2, ఆర్. ఆర్.ఆర్, అఖండ. చిత్రాలకు రైటర్ గా పని చేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన ప్రీ- అనౌన్సెమెంట్ పోస్టర్, జగపతి బాబు లుక్ కు మంచి స్పందన వస్తోంది. ఆయన ఈ చిత్రంలో ‘భీమ్ రావ్ దొర’ గా కనిపించనున్నారు. ఇక తాజాగా ‘రుద్రంగి’ సినిమా నుంచి మమతా మోహన్ దాస్ నటిస్తున్న జ్వాలాబాయి దొరసాని పాత్రను ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ద్వారా పరిచయం చేశారు. భయమెరుగని ధీరవనిత పాత్రలో ఆమె లుక్ ఆకట్టుకుంటోంది.

ఈ మోషన్ పోస్టర్ లో జ్వాలాబాయి దొరసాని పాత్రలో మమతా మోహన్ దాస్ చెప్పిన డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. *నువ్వు దొర అయితే నేను దొరసానిని తగలబెడతా, ఛల్ హట్* అంటూ ఆమె చెప్పిన డైలాగ్స్ మాస్ ను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ మోషన్ పోస్టర్ కు చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది.

కంటెంట్ తో వెళ్లే కథతో, మంచి సినిమాలని ప్రేక్షకులకి అందించాలనుకునే నిర్మాతలతో ‘రుద్రంగి’ చిత్రాన్ని పేరొందిన నటులు జగపతి బాబు, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహందాస్, కాలకేయ ప్రభాకర్, సదానందం తదితరులతో తెరకెక్కిస్తున్నారు. సంతోష్ శనమోని సినిమాటోగ్రఫీ, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ మరియు నాఫల్ రాజా ఐఏఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని థియేటర్లలో త్వరగా విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సిద్ధమవుతున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here