విష్ణు మంచు ‘జిన్నా’ భాయ్‌కు ట్విట్టర్ సలామ్… టాప్ ట్రెండ్స్‌లో!
జిన్నా… జిన్నా… జిన్నా… సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక్కటే డిస్కషన్! విష్ణు మంచు కథానాయకుడిగా నటించిన ‘జిన్నా’ గురించే! దీపావళి కానుకగా అక్టోబర్ 21న తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఆదివారం ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. అంతకు ముందు విష్ణు తెలుగు రాష్ట్రాల్లోని పలు పట్టణాలు, నగరాలతో పాటు బెంగళూరు, ముంబై, కొచ్చి వెళ్లి వచ్చారు. ప్రతి చోట విష్ణుకు గ్రాండ్ వెల్కమ్ లభించింది.
విష్ణు మంచు మాటల్లో ఫిల్టర్ ఉండదు… ఆయన మాటలు మనసులోంచి వస్తాయి. కొచ్చిలో కలెక్షన్ కింగ్, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. మంచు మోహన్ బాబు హీరోగా మలయాళ సినిమా ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25’ రీమేక్ చేస్తున్నట్లు, ఆ చిత్రాన్ని తన తండ్రి, మరొక యువ హీరోతో తాను నిర్మిస్తున్నట్లు విష్ణు మంచు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో పలు కాలేజీలకు వెళ్లిన ఆయన విద్యార్థులతో సరదాగా సంభాషించారు. ట్విట్టర్‌లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులోనూ నో ఫిల్టర్స్! ఆ లక్షణం ప్రేక్షకులకు నచ్చింది. స్టూడెంట్ వాట్సాప్ గ్రూప్స్, ట్విట్టర్ ట్రెండ్స్, యూట్యూబ్ వీడియోస్… ఎక్కడ చూసినా విష్ణు మంచు ‘జిన్నా’ సినిమా గురించి, ఆయన డౌన్ టు ఎర్త్, స్ట్రెయిట్ ఫార్వర్డ్ & స్మైలింగ్ బిహేవియర్ గురించి స్టేటస్‌లు, పోస్టులు.
‘జిన్నా’ గురించి అభిమానులు, సామాన్య ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘జిన్నా’ ప్రచార చిత్రాల్లో… అన్నిటిలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నది ఒక్కటే… ఎంటర్‌టైన్‌మెంట్… ఎంటర్‌టైన్‌మెంట్… ఎంటర్‌టైన్‌మెంట్! పిల్లల నుంచి పెద్దల వరకు… అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే ఎంటర్‌టైన్‌మెంట్ ఉందని టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో క్లారిటీ వచ్చింది. ఇప్పుడీ సినిమా ట్విట్టర్ ట్రెండ్స్‌లో దుమ్ము రేపుతోంది. ‘జిన్నా’ ట్రైలర్‌లో డైలాగ్ ఉంది కదా… ‘జిన్నా అంటే లోడ్ చేసిన గన్’ అని! అది నిజమే… ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడ్ చేసిన గన్. ఆ ధమాకా సౌండ్ దీపావళి కంటే ముందు సోషల్ మీడియాలో మొదలైంది. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ చూస్తుంటే దీపావళి నుంచి థియేటర్లలో ‘జిన్నా’ మోత మొదలవుతుందని చెప్పవచ్చు.