నాగ చైతన్య – వెంకట్ ప్రభు ద్విభాషా చిత్రం NC 22 ప్రధాన సాంకేతిక విభాగం, క్రియేటివ్ టీమ్ ని ప్రకటించిన మేకర్స్

0
131

అక్కినేని నాగ చైతన్య తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ చిత్రానికి  NC22 అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. NC22 చైతన్య తొలి  తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం.  క్రియేటివ్  డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టి నటిస్తోంది. దర్శకుడు వెంకట్ ప్రభుకి ఇది తొలి తెలుగు చిత్రం.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకులైన తండ్రీ కొడుకులు ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం మరో విశేషం. వారిద్దరూ కలసి చేస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ కాంబినేషన్‌లో చార్ట్‌బస్టర్ ఆల్బమ్ ఖాయమని చెప్పాలి. నాగచైనత్య కెరీర్‌లో అత్యంత భారీ చిత్రాల్లో NC22 ఒకటి.

ఈ సినిమా చిత్రీకరణ సెప్టెంబర్ 21, 2022న ప్రారంభమవుతుందని మేకర్స్ ఇటీవల ప్రకటించారు. ముందుగా చెప్పినట్లే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీగా వేసిన సెట్‌లలో షూటింగ్ ప్రారంభమైంది.

ఈ చిత్రంలో చాలా మంది ప్రముఖ నటీనటులు, ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ రోజు టెక్నికల్ టీంని పరిచయం చేశారు.

బ్రిలియంట్ సినిమాటోగ్రాఫర్ ఎస్ఆర్ కతీర్ ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చారు. స్టార్ డైలాగ్ రైటర్ అబ్బూరి రవి డైలాగ్స్ రాయగా, వెంకట్ రాజన్ ఎడిటింగ్ అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్ కోసం అత్యంత ప్రతిభావంతుడైన రాజీవన్‌ని ఎంపిక చేశారు.

అద్భుతమైన ఆర్ట్ వర్క్‌ను అందించే ఆర్ట్ డైరెక్టర్ డి.సత్యనారాయణని ఈ చిత్రం కోసం ఎంపిక చేశారు. కీలకమైన యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేయడానికి ఇంటర్నేషనల్ యాక్షన్ డైరెక్టర్ యాన్నిక్ బెన్ తో పాటు మహేష్ మాథ్యూ కూడా యాక్షన్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేస్తున్నారు.

అద్భుతమైన, ప్రతిభావంతులైన టీమ్ ని పరిచయం చేస్తూ నిర్మాతలు ఇచ్చిన తాజా అప్‌డేట్‌లు ప్రాజెక్ట్ పై అభిమానులు, ప్రేక్షకుల అంచనాలు పెంచాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్‌ సమర్పిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు.

నటీనటులు: నాగ చైతన్య, కృతి శెట్టి తదితరులు
సాంకేతిక  విభాగం
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్ ప్రభు
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
సమర్పణ: పవన్ కుమార్
సంగీతం: మాస్ట్రో ఇళయరాజా, లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రాఫర్: ఎస్ఆర్ కతీర్
ఎడిటర్: వెంకట్ రాజన్
డైలాగ్స్: అబ్బూరి రవి
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్
యాక్షన్: యాన్నిక్ బెన్, మహేష్ మాథ్యూ
ఆర్ట్ డైరెక్టర్: డివై సత్యనారాయణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here