PUSHPAK మరియు JBHRNKL సమర్పణలో చేతన్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదర్శ్, చిత్ర శుక్లా, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, భరణి శంకర్, జయలలిత, జయశ్రీ ఎస్ రాజేష్, అనిత చౌదరి, సుదర్శన్, రాజా రవీంద్ర, శ్రీనివాస్ ఐఏఎస్ నటీ నటులుగా ఆంథోని మట్టిపల్లి దర్శకత్వంలో చేతన్ రాజ్ నిర్మిస్తున్న చిత్రం “గీతా సాక్షిగా”. నిజ జీవిత సంఘటనల ఆధారంగ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇంతకు ముందు ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్స్ విడుదల చేసినప్పటి నుండి ప్రేక్షకులకు క్యూరియాసిటీతో పాటు హైప్ ను పెంచుతూ విశేషంగా ఆకట్టుకుంటుంది .
తాజాగా ఈ చిత్రం నుండి ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ తో మరో అద్భుతమైన టీజర్ ను విడుదల చేశారు మేకర్స్..ఈ టీజర్ చూస్తుంటే ఇది కోర్ట్ డ్రామాగా ఉండబోతోందని తెలుస్తుంది. టీజర్‌లో నటుడు ఆదర్శ్‌ను క్రిమినల్‌గా మరియు రాజా రవీంద్ర, లాయర్ శ్రీకాంత్ అయ్యంగార్, పోలీస్ ఆఫీసర్ ఇలా ముగ్గురూ కలసి నటుడు ఆదర్శ్ ను టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. పద్మ వ్యూహం లో చిక్కుకోవడానికి నేను అభిమన్యున్ని కాదు వాడి బాబు అర్జునున్ని రా అంటూ నటుడు ఆదర్స్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ తర్వాత సిక్స్ ప్యాక్ బాడీ తో తను చేసే ఫైట్ చూస్తుంటే అందరిలో ఈ కథపై ఎంతో ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తుంది.ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్‌తో, BGMతో అందరినీ అలరిస్తుంది అని చెప్పవచ్చు. శ్రీకాంత్ అయ్యంగార్, రూపేష్ శెట్టి, భరణి శంకర్, జయలలిత, అనిత చౌదరి, రాజా రవీంద్ర లతో పాటు అనేకమంది సీనియర్ నటీనటులతో నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. వెంకట్ హనుమ నరిసేటి సినిమాటోగ్రఫీగా , కిషోర్ మద్దాలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను అక్కట్టుకుంటుందనే ఆశా భావాన్ని వ్యక్తం చేశారు చిత్ర నిర్మాతలు
నటీ నటులు
ఆదర్శ్, చిత్ర శుక్లా, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, భరణి శంకర్, జయలలిత, జయశ్రీ ఎస్ రాజేష్, అనిత చౌదరి, సుదర్శన్, రాజా రవీంద్ర, శ్రీనివాస్ ఐఏఎస్ తదితరులు
సాంకేతిక నిపుణులు
కథ – నిర్మాత : చేతన్ రాజ్
స్క్రీన్ ప్లే – దర్శకత్వం : ఆంథోని మట్టిపల్లి
సంగీతం: గోపీసుందర్
ఆడియో : ఆదిత్య మ్యూజిక్
సినిమాటోగ్రఫీ: వెంకట్ హనుమ నరిసేటి
ఎడిటర్: కిషోర్ మద్దాలి
సాహిత్యం: రెహమాన్
కళ: నాని
నృత్యం : యశ్వంత్ – అనీష్
ఫైట్స్ – పృధ్వీ
పి. ఆర్. ఓ : సురేంద్ర నాయుడు, ఫణి