అభిమానులను సేవా కార్యక్రమాల వైపు నడిపించిన ఘనత ‘కృష్ణంరాజు గారిదే – మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారయణ

0
19

సినిమా పరిశ్రమలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ఎంతో మంది హీరోలు ఉన్నప్పుటికీ. తనదైన శైలీలో, విభిన్న పాత్రల ద్వారా ప్రజల అభిమానాన్ని చూరగొన్న విలక్షణ నటుడు కృష్ణంరాజు అనే మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. కృష్ణంరాజు ప్లాన్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో… ఆదివారం ఉదయం గుంటూరులోని సిందూరి హోటల్ లో సినీహీరో కృష్ణంరాజు సంతాప సభ జరిగింది.

సభలో కన్నాలక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. అభిమానులను కృష్ణంరాజు ఎంతో ప్రేమించేవారని, తాన అభిమానులను సేవా కార్యక్రమాల వైపు తిప్పిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కృష్ణంరాజు సినీ, రాజకీయ రంగాలలో ఎన్నో సేవలందించారని కొనియాడారు. కొన్ని పలు చిత్రాలలో కృష్ణంరాజు అపూర్వ నటన ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. కృష్ణంరాజు మృతి బాధాకరమని, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నా’ అని అన్నారు.

మరో మాజీ మంత్రి, కళాభిమాని డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ… కృష్ణంరాజు సినిమా రంగంలో అన్న తరహ పాత్రలు పోషించి ఎంతో ఎదిగారని, రాజకీయ రంగంలోనూ ఎంతో రగించారని కొనియాడారు. మాఆయన స్నేహనికి పెట్టింది పేరు అన్ని అతిధి మర్యాదల్లోనూ ఆయనకు ఆయనే సాటి అన్నారు. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే గుణం ఆయనలో ఉందన్నారు. సినీరంగరి ఒక పెద్ద దిక్కును కొల్పోవటం, కళాభిమానులకు తీరని లోటన్నారు.

ఎం.ఎల్.సి ‘లక్ష్మణరావు మాట్లాడతూ… కృష్ణం రాజులో ఒక మహానటు జున్నారన్నారు. అమరదీపం, బొచ్చిన బ్రహ్మన్న చిత్రాలలోని కృష్ణంరాజు నటనకు రాష్ట్ర ప్రభుత్వం ‘ ఉత్తమ నటుడు’ నంది అవార్డ్ ఇచ్చి ప్రోత్సహించిందన్నారు. నిర్మల మైన మనసు, నిండైన గాంభీర్యం ఆయన సొంతం అన్నారు

కన్నా విద్యాసంస్థల అధినేత కన్నా మాస్టారు మాట్లాడతూ సినీ నిర్మాతగా కృష్ణంరాజు ఎన్నో సందేశాత్మక చిత్రాలు నిర్మించారన్నారు.. అద్భుతమైన ఓ లెజెండున్ను కొల్పోవడం టాలీవుడ్ కు తీరని లోటు అన్నారు. గుజరాత్ భూకంప బాధితులకు అప్పట్లో తమ స్కూలు ద్వారా సేకరించిన విరాళాలకు కృష్ణంరాజు ద్వారానే ప్రభుత్వానికి అందచేసామన్నారు.

జన సంఘం వ్యవస్థాపకజ జొన్నలగడ్డ శ్రీరామచంద్ర శాస్త్రి మాట్లాడుతూ… అభిమానులు ఎలా ఉండాలో…. కృష్ణంరాజు తనకు నేర్పారని. 1976 లో కృష్ణంరాజు పేరుతో అభిమాన సంఘం నెల కొలి, ఆయన సలహాలు, సూచనలతోనే ఇప్పటి వరకు కూడా హె ప్రజాహిత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, అందరి అభిమానాన్ని చూరగాని ఆదర్శంగా నిలిచామన్నారు. వివిధ కార్యక్రమాల కోసం కృష్ణంరాజును 38 సార్లు గుంటూరుకు పిలిపించటం జరిగిందన్నారు. ఉదార గుణం అనేది కృష్ణంరాజు గారిలో స్వతహగా ఉండే సుగుణం అన్నారు. అభిమానులను నిశ్శబ్ద నిశీధిలో విడిచి అనంత లోకాలకు పయనమైన మారాజు ఉరికి గారు లేని లోటు .. మాకు ఎప్పటికీ తీరని లోటేనన్నారు.

విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు మాట్లాడుతూ.. పేరులోనే కాదు.. తీరులోనూ ఆయన రాజేనన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రమలు నిర్వహించి తెలంగాణ ప్రభుత్వం ఆయనను గౌరవించిందన్నారు.

నందమూరి, అక్కినేని, సూపర్ స్టార్ అభిమాన సంఘాల నాయకులు పుల్లా సుందరంబాబు, పి. సూరి, కోటశేషగిరి ప్రసంగపంచారు. 32 వ డివిజన్ కార్పోరేటర్ ఆచారి ప్రసంగించారు. తోలుత కృష్ణం రాజు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో 1916 లో అభిమాన సంఘాన్ని స్థాపించిన అభిమానులు రాళ్లబండి రాజేంద్ర ప్రసాద్, రాళ్ళబండి శివ రామ కృష్ణ, మాలెంపాటి లక్ష్మీ ప్రసన్న కుమార్, ఫలిం పంపిణి దారులు శ్రీనివాసరెడ్డి, శంకర్, రామిరెడ్డి, S.V. యాడ్స్ కుమార్, గుమ్మడి సీతారామయ్యచౌదరి తదితరులు పాల్గోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here