అమెజాన్ – ప్రైమ్ వీడియో త్వరలో Modern Love Hyderabad

0
176

అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన ‘మోడర్న్ లవ్ హైదరాబాద్’ ట్రైలర్ విడుదల కార్యక్రమం.  అందరి ఎదురు చూపులు ఫలిస్తున్న సమయం ఇది. ఇవి ఆరు విభిన్నమైన ప్రేమ కథలు. జాన్ కార్నీ ఆధ్వర్యంలో వచ్చిన ఒరిజినల్ అమెరికన్ సిరీస్ అందరి మన్ననలూ పొందింది. ‘మోడర్న్ లవ్’ పేరుతో  ఆరు కొత్త కథల్నీ ఇపుడు హైదరాబాద్ చాప్టర్ సమర్పిస్తోంది. ప్రేమ పరిమళించే ఈ కథల్లో నిత్యా మీనన్, రేవతి, ఆది పినిశెట్టి, రీతూ వర్మ, అభీజీత్ దుద్దల, మాళవిక నాయర్, సుహాసిని మణిరత్నం, నరేష్ అగస్త్య, ఉల్క గుప్త, నరేష్, కోమలి ప్రసాద్ నటించారు.

ప్రసిద్ధి చెందిన ‘ న్యూయార్క్ టైమ్స్’ దిన పత్రికలోని ఒక ‘కాలమ్’ వల్ల ఉత్తేజితులై ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’ ని తెరకెక్కించడానికి ప్రతిభావంతులైన నలుగురు ఉత్తమ దర్శకులు నగేష్ కుకునూర్, వెంకటేష్ మహా, ఉదయ్ గుర్రల , దేవిక బహుధానం చేతులు కలిపారు.

SIC ప్రొడక్షన్స్ పతాకం నిర్మించిన ‘మోడర్న్ లవ్ హైదారాబాద్’ ఈ ఏడాది జూలై 8న ప్రపంచమంతటా 240 దేశాల్లో, ప్రైమ్ వీడియో ద్వారా ఘనంగా విడుదల అవుతోంది.

అమెజాన్ ప్రైమ్ ఒక గొప్ప ఆఫర్ ఇస్తోంది. అందరికీ అందుబాటులో వుండే ధరకి, అపరిమితమైన స్ట్రీమింగ్.. అధ్బుతమైన సినిమాలు, టీవీషోలూ, స్టాండ్ అప్ కామెడీ, అమెజాన్ ఒరిజినల్స్, అడ్వర్ టైజ్ మెంట్ల గోల లేని శ్రవణపేయమైన అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్… ఇంకా ఎన్నో.. అనేక వస్తువుల్నీ, ఉత్పత్తుల్నీ వేగంగా అందజేయడం, టాప్ డీల్స్ ని అందుకునే సత్వర అవకాశం, ‘ప్రైమ్ రీడింగ్’ ద్వారా అపరిమితమైన రీడింగ్ సదుపాయం. ప్రైమ్ గేమింగ్ ద్వారా మొబైల్ గేమింగ్ కంటెంట్.. ఇవన్నీ కూడా ఏడాదికి సభ్యత్వం 1499 రూపాయలు మాత్రమే. ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ కి చందాదారులుగా చేరిన కస్టమర్లు ‘మోడర్న్ లవ్ హైదరాబాద్’ ని హాయిగా చూడవచ్చు.

ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ సింగిల్ యూజర్. ఎయిర్ టెల్ ప్రీ పెయిడ్ కష్టమర్లకి మొబైల్ ఓన్లీ ప్లాన్ ప్రస్తుతం లభ్యం అవుతోంది.

హైదరాబాద్, ఇండియా, 27 జూన్ 2022: ప్రేమలో గొప్ప ఆకర్షణవుంది. అది ఉత్తేజ పరుస్తుంది. గాయ పరుస్తుంది. ఐనా, దేని కంటే కూడా ప్రేమ అనేది స్వాంతన చేకూరుస్తుంది. విభిన్న సంస్కృతులతో అలరారే హైదరాబాద్ మహా నగరంలో వికసించిన ప్రేమ మాధుర్యాన్నీ, మానవ సంబంధాల్లోని ఉద్వేగాన్నీ, ఉద్దీపననీ ప్రతిబింబించే ‘మోడర్న్ లవ్ హైదరాబాద్’ మీ హృదయాన్ని తాకుతుంది. అసలు సిసలు ‘మోడర్న్ లవ్’ కి ఇది ఇండియన్ లోకల్ వెర్షన్.

SIC ప్రొడక్షన్స్ ద్వారా ఇలాహే హిప్టులా నిర్మించిన  ప్రేమ కథా కావ్యం ఇది. సంప్రదాయాలూ, ఆధునికతా కలగలిసిన నేటి హైదరాబాద్ లోని యువతరం ఆశల ప్రతిబింబంగా ఈ ప్రేమ సిరీస్ రూపుదిద్దుకుంది. నగేష్ కుకునూర్ నైపుణ్యానికి నిదర్శనంగా ఈ కొత్త తెలుగు అమెజాన్ సిరీస్ మీకో వింత అనుభవాన్ని ఇవ్వబోతోంది. 2022 జూలై 8న  ఇండియాతో సహా ప్రపంచమంతటా 240 దేశాల్లో ‘మోడర్న్ లవ్ హైదరాబాద్’ ని చూడవచ్చు.

అమెరికన్ పత్రిక న్యూయార్క్ టైమ్స్ వల్ల పాపులర్ అయిన వృత్తాంతం ఆధారంగా ఈ అందమైన ఆరు ప్రేమ కథల నిర్మాణం జరిగింది. నగేష్ కుకునూర్, వెంకటేష్ మహా, ఉదయ్ గుర్రాల, దేవికా బహుధానంల దర్శకత్వ ప్రతిభకి ఇది నిలువుటద్దం. ఈ ఎపిసోడ్లలో నిత్యా మీనన్, రేవతి, ఆది పినిశెట్టి, రీతూ వర్మ, అభిజీత్ దుద్దుల, మాళవిక నాయిర్, సుహాసిని మణిరత్నం, నగేష్ అగస్త్య, ఉల్కా గుప్తా, నరేష్, కోమలీ ప్రసాద్ లు హృదయాన్ని హత్తుకునే నటనతో ఆకట్టుకుంటారు.

My unlikely pandemic dream partner, Fuzzy purple &Full Of Thorns, Why Did She Leave Me There? ఎపిసోడ్లని ప్రతిభావంతంగా తెరకెక్కించిన నగేష్ కుకునూరు, “ప్రేమ అనేది అంతులేని వెన్నెల కెరటాల్లా ఎగిసిపడే ఉద్వేగం. మనం ఎదగడానికీ, విశ్వసించడమూ, క్షమించడమూ ఎలాగో తెలుసుకోవడానికి ప్రేమ ఎలా ఉపకరిస్తుందో MODERN LOVE HYDERABAD లో చెప్పే ప్రయత్నం చేశాను. ఇది ఒక రకంగా ప్రేమకే నేను రాసిన ప్రేమలేఖ. చరిత్ర సంస్కృతుల సంప్రదాయ  సోయగంతో ఉంటూనే యవ్వన కాంతిలో మెరిసిపోయే హైదరాబాద్ అనే ఒక అసాధారణ నగరం హృదయావిష్కరణ చేయడానికి ప్రయత్నించాను. ఈ మరిచిపోలేని ప్రేమ సిరీస్ లోని అన్ని కథల్లోనూ హైదరాబాద్ నగర ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. ఎంతో మంది, ఎన్నో రకాల మనుషులు ‘ఇది నా ఇల్లు’ అని చెప్పుకునే హైద్రాబాద్ నగరం హృదయ స్పందనని మేం వినగలిగాం. దాన్నే దృశ్యంగా మలిచాం. ప్రేక్షకులు ఈ పాత్రల్లో తమని తాము చూసుకుంటారనీ, తమ జీవితాలకు దగ్గరగా వున్న ఫీల్ పొందుతారనే నేను అనుకుంటున్నాను” అన్నారు.

Finding Your Penguin దర్శకుడు వెంకటేశ్ మహా మాట్లాడుతూ, మోడర్న్ లవ్ హైదరాబాద్ లో వున్న ఒక నిజమైన అద్భుతం ఏంటంటే, కథలన్నీ ఆధునికమైనవే అయినా సాంస్కృతిక మూలాలను మాత్రం వీడలేదు. ప్రేమ కోసం భారతీయ యువ జనులు పడుతున్న పాట్లు, ఆన్ లైన్ డేటింగ్ సైట్ల వెతుకులాట, మిత్రుల ప్రేమ సమస్యల పరిష్కారం… లాంటి వన్నిటినీ నేను తెరకెక్కించాను. ఈ కాలపు కథలు చెబుతూనే మన యువతరం అభిరుచులూ జీవితాలూ వేగంగా మారుతున్న దృశ్యాన్ని ఆవిష్కరించాను. ఈ కథలో తెర మీద కనిపించే పాత్రని మీరు వెంటనే పోల్చుకుంటారు. అలాంటి వాళ్ళు మీ మిత్రులే కావచ్చు. లేదా అది మీరే కావచ్చు కూడా! అద్భుతమైన అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఈ కథల్నీ ప్రపంచానికి అందించడం నన్ను ఉత్తేజితున్ని చేస్తోంది.

ప్రపంచ ఎంటర్ టైన్ మెంట్ పటంపై హైదారాబాద్ ని ఆవిష్కరిస్తున్న ఈ కథల్లో నేనూ భాగస్వామిని కావడం నాకు ఆనందంగా ఉంది అన్నారు మహా.

What clown wrote this script? దర్శకుడు ఉదయ్ గుర్రాల మాట్లాడుతూ, ” ఏ ఇతర మానవానుభవం కంటే కూడా ప్రేమకున్న విస్తృతి అపారమైనది. కేవలం రొమాన్స్ మాత్రమే కాకుండా, ఆ పరిధినిదాటి వున్న ప్రేమ హద్దులన్నిటినీ చేరగల ప్రయత్నం ‘ మోడర్న్ లవ్ హైదరాబాద్’లో చేసాము. నా What clown wrote this script? లో ఇతివృత్తం ప్రపంచాన్ని చుట్టి వచ్చేదే అయినా తెలుగు హృదయంతో, తెలుగు కళ్ళలోంచి చూసిన తీరు మనకు నచ్చి తీరుతుంది. ఈతరం యువతీయువకులు ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేయడానికి గల లోతైన మానసిక అంశాలను చిత్తశుద్ధితో ఒక అంచనా వేయగలిగాం. హైదరాబాద్ అనే మహానగరం పట్ల మా అవ్యాజమైన ప్రేమానురాగాన్ని ప్రపంచ ప్రేక్షకులు అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా చూడగలగడం నాకెంతో ఆనందాన్నిస్తోంది.

‘About that rustle in the bushes’ ఎపిసోడ్ దర్శకురాలు దేవికా బహుధానం మాట్లాడుతూ, “చరిత్ర సంస్కృతి కలసి నిలిచిన నగరం హైదారాబాద్. ఇక్కడ అన్ని మతాల వాళ్ళు కలసిమెలిసి బతుకుతారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కేంద్ర బిందువైన ఈ నగరం నిరంతరం మారుతూనే ఉంటుంది. ప్రేమకి అర్థమూ, అవగాహన రోజు రోజుకీ మారుతున్నాయి. దాన్నే నా కథ చెబుతుంది. ఆశ, మార్పు, సంబాళించుకోవడం, తనకి తాను సౌఖ్యంగా ఉండటం, ఇంకా, అంగీకరించగలిగే విశాల హృదయం… ఇలాంటి వన్నీ నా కథలో వున్నాయి. అలాగే మా ప్రతీ కథ హైదరాబాద్ ప్రేమ పరిమళాలని వెదజల్లుతోంది. ప్రపంచ ప్రేక్షక జనం అమెజాన్ ప్రైమ్ లో దీన్ని ఆస్వాదించగలరు. ఇవన్నీ వాళ్ల హృదయానికి దగ్గరగా వుండే కథలు” అన్నారు.

కీరవాణి సంగీతం: SIC ప్రొడక్షన్స్ – ఈ కొత్త తెలుగు అమెజాన్ ఒరిజినల్ సిరీస్ ని ప్రసిద్ధ నిర్మాత ఇలాహే హిప్టులా మన ముందుకు తెస్తున్నారు, నగేష్ కుకునూర్  సంపూర్ణ సహకారంతో. కథలు: నగేష్ కుకునూరు, శశి సుడిగల, బహాయిష్ కపూర్.
ఈ సిరీస్ కి సంగీతాన్ని ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి, కాలభైరవ, తపస్ రెలియా, స్మరణ్ సాయి, వివేక్ సాగర్ లు ఉమ్మడిగా సమకూర్చారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here