హరీష్ కళ్యాణ్, అతుల్య రవి, షణ్ముగం ముత్తుసామి, థర్డ్ ఈవ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎస్పీ  సినిమాస్ ‘డీజిల్ ‘ఫస్ట్ లుక్ విడుదల

0
183

హరీష్ కళ్యాణ్, అతుల్య రవి జంటగా థర్డ్ ఈవ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎస్పీ సినిమాస్ బ్యానర్స్ పై షణ్ముగం ముత్తుసామి దర్శకత్వంలో ఎం దేవరాజులు నిర్మిస్తున్న  రొమాంటి యాక్షన్ ఎంటర్టైనర్ కు ‘డీజిల్ ‘అనే టైటిల్ ని ఖరారు చేశారు. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని కూడా విడుదల చేశారు.

ఒక పోస్టర్‌లో డీజిల్ ట్యాంక్‌ ని పట్టుకున్న హరీష్ కళ్యాణ్, హాఫ్ శారీలో అందంగా కనిపిస్తున్న అతుల్యను రొమాంటి గా చూస్తుండగా, మరో పోస్టర్ లో ఇంటెన్స్ మోడ్ లో డీజిల్‌ ట్యాంక్‌ పైపు పట్టుకుని టెర్రిఫిక్ గా కనిపించాడు హరీష్ కళ్యాణ్. రోమాన్స్ తో పాటు యాక్షన్ ని జోడించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.

ధిబు నినన్ థామస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎంఎస్ ప్రభు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. షాన్ లోకేష్ ఎడిటర్ గా రెంబన్ ఆర్ట్ డైరెక్టర్ గా రాజశేఖర్ స్టంట్ డైరెక్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

తారాగణం : హరీష్ కళ్యాణ్, అతుల్య రవి, పి.సాయికుమార్, ఎస్. కరుణాస్, వినయ్ రాయ్ అనన్య, టి.పి. అరుణ్ పాండియన్, మరిముత్తు, సురేఖా వాణి, వివేక్ ప్రసన్న , కాళీ వెంకట్
సుబత్ర.ఎన్ , ధీనా (దినేష్), తంగదురై కె, లక్ష్మీ శంకర్ (అభిషే) ఎస్.దేవరాజ్ , జార్జ్ విజయ్ నెల్సన్ , ప్రేమ్ కుమార్, ఎస్ సచిన్ , రమేష్ తిలక్, సెల్వి

సాంకేతిక విభాగం :
దర్శకత్వం : షణ్ముగం ముత్తుసామి
బ్యానర్ : థర్డ్  ఈవ్ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాత : ఎం దేవరాజులు
ప్రొడక్షన్ : ఎస్పీ సినిమాస్
సంగీతం:  ధిబు నినన్ థామస్
డీవోపీ: ఎంఎస్  ప్రభు
ఎడిటర్ :  షాన్ లోకేష్
ఆర్ట్ డైరెక్టర్ : రెంబన్
స్టంట్ డైరెక్టర్ : రాజశేఖర్
కాస్ట్యూమ్ డిజైనర్ :  ప్రవీణ్ రాజా
డిజైనర్ : ట్యూనీ జాన్
మార్కెటింగ్, ప్రమోషన్: డిఈసి
పీఆర్వో: వంశీ- శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here