కొండా చిత్రంలో నక్సల్ లీడర్ ఆర్కే గా ప్రశాంత్ కార్తీ!!

0
14

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించే చిత్రాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది. బయోపిక్ చిత్రాలను ఎంతో బాగా చిత్రీకరించే ఆర్జీవీ ఇప్పుడు మరో పవర్ ఫుల్ యాక్షన్ బయోపిక్ ను తెరపై ఆవిష్కరించారు. రాజకీయ నాయకులు గా, ప్రజాప్రతినిధులు గా సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగి ఉన్న కొండా మురళి, కొండా సురేఖ జీవిత చరిత్ర ఆధారంగా రామ్ గోపాల్ వర్మ కొండా అనే సినిమా తెరకెక్కించాడు. కొండా సుస్మిత పటేల్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా లో త్రిగుణ్ కొండా మురళి గా నటిస్తున్నారు. జూన్ 23 వ తేదీన ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమా లో నటుడు ప్రశాంత్ కార్తీ ఓ కీలక పాత్రలో నటించారు. అంతకుముందు ప్రశాంత్ కార్తీ పలు సినిమాల్లో నటించి గుర్తింపు దక్కించుకోగా ఈ సినిమాలో కీలక పాత్ర అయిన నక్సల్ లీడర్ ఆర్కే గా ఆయన కనిపించనున్నాడు.

ఈ పాత్ర గురించి సినిమా విశేషాల గురించి  ప్రశాంత్ కార్తీ మాట్లాడుతూ.. కొండా సినిమా లో ఒక పవర్ ఫుల్ పాత్రలో నటించాను. ఇప్పటివరకు నా కెరీర్ లో చేసిన పాత్రల్లో ఆర్కే పాత్ర ఎంతో ముఖ్యమైంది. ఇంతటి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఆర్కే యొక్క విప్లవాత్మక ఆలోచనలు,నాకు చాలా స్ఫూర్తినిచ్చాయి. ఆయనలా కనిపించడానికి ప్రత్యేక సాధన చేశాను. తప్పకుండా అందరూ మెచ్చుకునేలా నా పాత్ర ఉంటుంది. అందరు అలరింపబడే విధంగా ఈ సినిమా ఉంటుంది. అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here