దర్శకుడిగా గమ్యం, వేదం, కంచె, గౌతమీ పుత్ర శాతకర్ణి వంటి చిత్రాలను తెరకెక్కించి దర్శకుడిగా పరిశ్రమపై తనదైన ముద్ర వేశారు క్రిష్. ఆయన 9 అవర్స్ వెబ్ సిరీస్ తో డిజిటల్ వేదిక మీదకు రావడం ఇండస్ట్రీని, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఇటీవలే వివిధ భాషల్లో స్ట్రీమింగ్ మొదలైన ఈ వెబ్ సిరీస్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి హిట్ గా నిలిచింది. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ వెబ్ సిరీస్ లలో ప్రత్యేకంగా నిలిచింది.
పీరియాడికల్ డ్రామాగా రూపొందిన 9 అవర్స్ వెబ్ సిరీస్ లో చాలా మంది కొత్త నటీనటులైనా వారి పాత్రలకు ఇచ్చిన ప్రాధాన్యత, ఆ పాత్రలను ఆసక్తికరంగా మలిచిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అందుకే కొత్త నటీనటులైనా ప్రేక్షకులు వారి నటనను ఇష్టపడుతున్నారు. తారకరత్న, అజయ్, వినోద్ కుమార్, మధు షాలినీ, రవి వర్మ, ప్రీతి అస్రానీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి వై, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కు నిరంజన్ కౌషిక్, జాకోబ్ వర్గీస్ దర్శకత్వం వహించారు.