ఇళయరాజా…..
ఆయన గొప్పవాడేకానీ అహంకారమండీ ఆయనకి అన్నాడొకాయన. స్వయం ప్రతిభ వున్నవాడికి ధిషణాహంకారం అలంకారమేనండీ అన్నాడింకొకాయన.
స్వచ్చమైన బంగారమైనా కొద్దిపాటి రాగి మిశ్రమంతోనేకదా అందమైన నగగా తయారవుతుంది అన్నాడు మరొకాయన.
వెన్నెలను తనివితీరా అనుభవిస్తున్నప్పుడు చంద్రుడిలో మచ్చ వుంటేనాకేం లేకపోతేనాకేం అన్నాను నేను.
ఆజన్మాంతం మనం తీర్చుకోలేని ఋణాలలో ఇలాంటి అద్భుత కళాకారుల ఋణాలు తొలివరుసలోనో మలివరుసలోనో మిగిలే వుంటాయి.
తిరిగి నన్నేమీ అడగకుండా నాకు ఆనందాన్ని పంచుతూనేవున్న ఈయన భూమ్మీద పుట్టినందుకు నాకు పరమ సంతోషం. అందుకే ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు.
(నా నీటి రంగుల్లో “సంగీతం”)— దేవీప్రసాద్.




