హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైన “రాజ్ కహానీ” టీజర్ & ఫస్ట్ లుక్

0
206

చిన్నప్పుడే అమ్మను కోల్పోయిన వ్యక్తి దర్శకుడైతే తను కోల్పోయింది అమ్మనే కాదు జీవితంలో వెలకట్టలేని అమ్మ ప్రేమను అని తెలుసుకొని అమ్మ ప్రేమను,అమ్మాయి ప్రేమకు ముడిపెడుతూ  చిత్రీకరించిన చిత్రమే “రాజ్ కహానీ” భార్గవి క్రియేషన్స్ పతాకంపై రాజ్ కార్తికేన్,చంద్రికా అవస్తి, సోనియా సాహా, ప్రియా పాల్, సాయి, జబర్దస్త్ ఫణి,  నటీనటులు గా రాజ్ కార్తికేన్ టైటిల్ రోల్ లో నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భాస్కర రాజు, ధార్మికన్ రాజు లు సంయుక్తంగా నిర్మించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ చిత్ర యూనిట్ “రాజ్ కహానీ” టీజర్ మరియు ఫస్ట్ లుక్ ను ఘనంగా విడుదల చేయడం జరిగింది.ఈ సందర్భంగా

చిత్ర  నిర్మాతలు భాస్కర రాజు, ధార్మికన్ రాజు లు మాట్లాడుతూ.. చిన్నప్పుడే అమ్మను కోల్పోయిన వ్యక్తి దర్శకుడై ప్రేమలోని వివిధ కోణాలను మంచి చెడులను అమ్మ ప్రేమను అమ్మాయి ప్రేమకు ముడిపెడుతూ పక్కా కమర్షియల్ హంగులతో తెరకెక్కించిన చిత్రమే “రాజ్ కహానీ”ఈ చిత్రం హైదరాబాద్ తో పాటు బెంగుళూర్, కర్ణాటక ప్రాంతాలలోని పర్యాటక ప్రాంతాల లో తెరకెక్కించబడిన ఈ చిత్రం టీజర్ ,ఫస్ట్ లుక్ ను హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరవేగంగా జరుపుకుంటుంది. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.

చిత్ర దర్శకుడు రాజ్ కార్తికేన్ మాట్లాడుతూ…పక్కా కమర్షియల్ చిత్రంగా ప్రేక్షకులకు ముందుకు వస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి సోదరుడు మహిత్ నారాయణ్ ఈ చిత్రానికి చక్కని సంగీతం సమకూరుస్తున్నాడు.పాటలన్ని బాగా వచ్చాయి.మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం యూత్  ను కచ్చితంగా ఆకట్టుకుంటుందని అని అన్నారు.

నటీనటులు:
రాజ్ కార్తికెన్,చంద్రికా అవస్తి, సోనియా సాహా, ప్రియా పాల్, సాయి, జబర్దస్త్ ఫణి, కె ఎ పాల్ రాము, మధుమణి, శ్రీలక్ష్మి, డీఎంకే మురళి, పుష్ప’ మల్లారెడ్డి, అర్జున్ రెడ్డి’ సుందరం, మహేంద్రనాథ్,

సాంకేతిక నిపుణులు:
చిత్రం: రాజ్ కహానీ
బ్యానర్: భార్గవి క్రియేషన్స్
నిర్మాతలు: భాస్కర రాజు, ధార్మికన్ రాజు
రచన & దర్శకత్వం: రాజ్ కార్తికేన్
సంగీతం: మహిత్ నారాయణ్ (చక్రి సోదరుడు)
డి. ఓ.పి:యస్.యస్.వి. ప్రసాద్
ఎడిటర్: సెల్వ కుమార్
పి.ఆర్.ఓ : హర్ష

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here