బుక్‌మైషోతో కలసి దేశవ్యాప్తంగా అడివి శేష్ ‘మేజర్’ ప్రివ్యూలు

0
183

అడివి శేష్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘మేజర్’ జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా  విడుదలవుతోంది.  ట్రైలర్, పాటలకు విశేష స్పందన అందుకోవడంతో భారీ అంచనాల పెరిగాయి. ముఖ్యంగా రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ బయోపిక్ ని ఘనవిజయంగా మలిచి మేజర్ సందీప్ కి ఘనమైన నివాళి అర్పించేందుకు చిత్ర యూనిట్ అన్ని సన్నాహాలు చేస్తుంది.

సాధారణంగా స్టార్ హీరోల సినిమాల ప్రీమియర్ షోలు ముందుగా చూస్తుంటాం. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ప్రతి భారతీయుడు చూడవలసిన కథ. రియల్ హీరో సందీప్ ‘మేజర్’ చిత్రానికి కూడా దేశవ్యాప్తంగా ప్రివ్యూలు వుండబోతున్నాయి. ఇండియాలో మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా సినిమాను ప్రదర్శించడానికి మేజర్ చిత్ర యూనిట్ బుక్‌మైషోతో జతకట్టింది. జూన్ 3న అధికారికంగా విడుదలకాబోయే ముందే ‘మేజర్’ ప్రత్యేక ప్రివ్యూలు వివిధ నగరాల్లో ప్రదర్శించనున్నారు.

బుక్‌మైషో యాప్ స్క్రీనింగ్ లిస్టు లో మీ సిటీని చూసి ‘మేజర్’ ప్రివ్యూ కోసం ఇప్పుడే  రిజిస్టర్ చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here