ఇప్పుడంటే ఎంత నచ్చిన సినిమానైనా ఒక్కసారి చూసి ఒదిలేస్తున్నాంగానీ చిన్నతనంలో నచ్చిన సినిమాని స్కూలు కాలేజ్ ఎగ్గొట్టిమరీ పదేపదే చూసేవాళ్ళం. అలా నేను ఎక్కువసార్లు మళ్ళీమళ్ళీ చూసిన సినిమాలు కె.రాఘవేంద్రరావు గారివే. ఓ సినిమా ద్వారా మన కాలాన్నీ డబ్బునీ పదేపదే కొల్లగొట్టాలంటే ఆ దర్శకుడికి ఎంత చాతుర్యం చతురత వుండివుండాలి?
80 వసంతాల నవయువకుడైన ఈ శతాధికచిత్ర సృష్టికర్తకు జన్మదిన శుభాకాంక్షలు.
నాకెవరిపైనైనా అభిమానమో ఇష్టమో కలిగినపుడు నాకున్న అరకొర సామర్ధ్యంతో వారి బొమ్మ గీసి చూసుకుని తృప్తిపడటం అలవాటు.
(వెండితెరపై రంగుపూలవనాలను సృష్టించి ఇంద్రజాలాలు చేసిన “రాఘవేంద్రుడు” నా నీటిరంగుల్లో). — దేవీప్రసాద్.




