విష్ణు  మంచు, పాయల్ రాజ్ ఫుత్ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ!

0
194

డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో విష్ణు మంచు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమాకి సంబంధించి ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాటకు ఓ స్పెషాల్టీ ఉంది. అదేంటంటే…

చాలా గ్యాప్ తర్వాత తెలుగు సినిమా కోసం ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రఫీ అందిస్తున్నారు. విష్ణు మంచు, పాయల్ రాజ్ ఫుత్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ అందిస్తుండటం విశేషం. ఈ పాట సినిమాకి హైలైట్ అవుతుందనే నమ్మకంతో ఉంది చిత్రం యూనిట్.

ఇప్పటికే ఈ సినిమాలో విష్ణు  మంచు  నటిస్తున్న ‘గాలి నాగేశ్వరరావు’ క్యారెక్టర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంటర్నేషనల్ సెన్సేషన్ సన్నీలియోన్ రేణుకగా, పాయల్ పాజ్ ఫుత్ స్వాతిగా కీలక పాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకి కథ, స్ర్కీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు కెమెరామ్యాన్ గా భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు. జి.నాగేశ్వరరెడ్డి మూల కథ అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here