సినీ పాత్రికేయ సంఘాల నాయకులకు దాసరి స్మారక పురస్కారాలు!!

0
58

దర్శకదిగ్గజం డాక్టర్ దాసరి నారాయణరావు 75వ జయంతిని పురస్కరించుకుని ప్రసాద్ ల్యాబ్స్ లో పలువురు సినీ ప్రముఖులు అతిథులుగా అత్యంత ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు సినీ పాత్రికేయ సంఘాల నాయకులను ఆత్మీయంగా సన్మానించారు. శతాధిక చిత్రనిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ సారధ్యంలో జరిగిన ఈ వేడుకలో తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సురేష్ కొండేటి-ఎమ్.లక్ష్మీనారాయణ, కోశాధికారి హేమసుందర్… తెలుగు ఫిల్మ్ వర్కింగ్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్-జనరల్ సెక్రటరీలు ఎమ్.ఎన్. భూషణ్-సజ్జా వాసు, ట్రెజరర్ సి.ఎమ్.ప్రవీణ్ కుమార్… తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ వారణాసి, ప్రధాన కార్యదర్శి వై.జె.రాంబాబు, ట్రెజరర్ సురేంద్రనాయుడులను శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా వారు దాసరితో తమకు గల అనుబంధాన్ని నెమరువేసుకుని… నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. వీరితోపాటు పలువురు ప్రముఖులకు దాసరి జీవన సాఫల్య పురస్కారాలు అందించడంతోపాటు… తెలుగు చిత్ర పరిశ్రమలోని 24 క్రాఫ్తుల సంఘాల ప్రెసిడెంట్-సెక్రటరీ-ట్రెజరర్స్ ను సన్మానించారు!!
ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు అశ్వినిదత్, జి.ఆదిశేషగిరిరావు, తమ్మారెడ్డి భరద్వాజ, టి.ప్రసన్నకుమార్, సి.కళ్యాణ్, కె.ఎల్.దామోదర్ ప్రసాద్, కె.అచ్చిరెడ్డి, అంబికా కృష్ణ… ప్రముఖ దర్శకులు ధవళ సత్యం, రేలంగి నరసింహారావు, ఎస్.వి.కృష్ణారెడ్డి, హీరో సుమన్, సీనియర్ రైటర్స్ సత్యానంద్, రాజేంద్రకుమార్, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రముఖ దర్శకుడు-నటుడు రావిపల్లి రాంబాబు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here