రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

0
255

ట్రెండ్ సెట్టర్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన తొలి సినిమా ‘అర్జున్ రెడ్డి’తో సంచలనం సృష్టించి, దాని రీమేక్ ‘కబీర్ సింగ్‌’ తో భారీ బ్లాక్‌బస్టర్‌ను అందించిన సందీప్ రెడ్డి… బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్‌తో కలిసి మరో బ్లాక్ బస్టర్ విజయానికి శ్రీకారం చుట్టారు.  భూషణ్‌కుమార్‌, ప్రణవ్‌రెడ్డి వంగ కలిసి ఈ చిత్రాన్ని టి సిరీస్‌, భద్రకాళి పిక్చర్స్‌పై ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నారు.

కథానాయకుడి పాత్రకి తగ్గట్టు ఈ చిత్రానికి ‘యానిమల్’అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. భారీ అంచనాలు వున్న ఈ చిత్రం కోసం పవర్ ఫుల్ సబ్జెక్ట్ ని రెడీ చేశారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.  రణబీర్ కపూర్ ని ఈ చిత్రంలో పూర్తిగా భిన్నమైన పాత్రలో చూపించనున్నారు. ఈ సినిమా కోసం రణబీర్ స్పెషల్ గా మేకోవర్ అయ్యారు.

యాక్షన్ న్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘యానిమల్’ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభయింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఈరోజు నుంచే హిమాలయాల్లో మొదలైయింది.

భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుటున్న యానిమల్ హిందీతో పాటు దక్షిణాది భాషల్లో  ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగాల క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో ప్రముఖ నటీనటులు కనిపించనున్నారు.

ఆగస్ట్ 11, 2023 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం కోసం అత్యున్నత టెక్నికల్ టీమ్ పని చేయనుంది.

తారాగణం: రణబీర్ కపూర్
టెక్నికల్ టీమ్:
దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా
నిర్మాతలు: భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా
బ్యానర్లు: టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్
పీఆర్వో : వంశీ-శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here