‘హలో జూన్’ మూవీ రివ్యూ

0
400

సినిమా : హలో జూన్
సమర్పణ :  మోజ్విత్ అండ్ చరణ్ తేజ్
బ్యానర్ : ఆంట్స్ టు ఎలిపెంట్స్ సినిమాస్ కో
నిర్మాతలు : అనిల్ రెడ్డి.ఎం, జయప్రకాశ్ వి
దర్శకుడు : అహ్మద్ కబీర్
నటీనటులు
రాజిష విజయన్,జోజు జార్జ్ ,  అశ్వతీ మీనన్, సన్నీ వేన్, సర్జానో ఖలీద్‌ తదితరులు
కథ: లిబిన్ వర్గీస్, అహ్మద్ కబీర్, లిబిన్ బేబి మాత్యు , డైలాగ్స్ : అనిల్ రెడ్డి.ఎం ,
పాటలు: శ్రీ సిరాగ్,
డి.ఓ.పి : జితిన్ స్టానిష్ లస్,
మ్యూజిక్ : ఇఫ్తీ,
ఎడిటర్ : లిజోపౌల్ ,
పి ఆర్.ఓ : అవినాష్ బండి, హరీష్,దినేష్

మేల్ ప్రస్పెక్టీవ్ నుండి ఇదివరకు కమింగ్ ఆఫ్ ఏజెడ్ డ్రామా మూవీస్ చాలా  వచ్చాయి. కానీ ఫీమేల్ ప్రస్పెక్టీవ్ నుండి చాలా తక్కువ వచ్చాయి. అందులో ఇది కూడా ఓకటవుతుంది.ఆంట్స్ టు ఎలిపెంట్స్ సినిమాస్ కో  ప్రొడక్షన్ పై  మోజ్విత్ అండ్ చరణ్ తేజ్ సమర్పణలో  రాజిష విజయన్,జోజు జార్జ్  నటీనటులు గా అహ్మద్ కబీర్ దర్శకత్వంలో అనిల్ రెడ్డి.ఎం, జయప్రకాశ్ వి లు సంయుక్తంగా కలసి నిర్మించిన లవ్ అండ్ ఫ్రెండ్ షిప్ స్టోరీ  ‘హలో జూన్’.  ప్రస్తుతం అన్ని హంగులు పూర్తిచేసుకుని  ఏప్రిల్ 1 నుండి ఆహాలో గ్రాండ్ గా  స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్ టైన్ చేస్తుందో .. రివ్యూ లో చూద్దాం పదండి.

కథ

జూన్ అనే 16 సంవత్సరాల అమ్మాయి స్కూల్ అయి పోయాక ఇంటర్ చేయడానికి ఒక కాలేజ్ లో జాయిన వుతుంది.అదే కాలేజీలో తన క్లాస్ లో ఉన్న అబ్బాయిని చూసి ప్రేమలో పడుతుంది.ఆ తరువాత తన లవ్ ను ఆ అబ్బాయికి ఎలా ఎక్స్ప్రెస్ చేసింది.. కాలేజ్ కు వెళ్లిన దగ్గరనుండి  26 సంవత్సరాల వరకు జర్నీ ఏమిటనేది ఈ మూవీ లో చూడచ్చు.అయితే గడిచిన 10 సంవత్సరాల జర్నీ లో  తన ఫ్యామిలీ, ఫ్రెండీషిప్ ,రిలేషన్ షిప్,లైఫ్ ఎక్సపిరియన్స్ తనను ఎలా మౌల్డ్ చేశాయి. ఆమె తల్లి,తండ్రుల నుంచి ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే “హలొ జూన్” సినిమా తప్పక చూడవలసిందే…

నటీనటుల పనితీరు

ఈ మూవీ లో హీరోయిన్ రాజిష విజయన్ నటన  హైలెట్ గా ఉంటుంది. తన నటనలో చాలా వెరేషన్స్ చూపిస్తూ.. తను చాలా చక్కగా పెర్ఫార్మ్ చేసింది.తన లవర్ గా పెర్ఫార్మన్స్ చేసిన నోయల్ కూడా బాగా నటించాడు.ఆనంద్ రోల్ లో నటించిన అర్జున అశోకన్ కూడా బాగా నటించాడు. ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా తమకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.కాలేజ్ నుండి వచ్చే క్యారెక్టర్స్ అందరూ కూడా ఎంతో న్యాచురల్ గా నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు

దర్శకుడు అహ్మద్ కబీర్ కు ఇది మొదటి సినిమా అయినా చాలా బాగా హ్యాండిల్ చేశాడు.ఇదొక కంప్లీట్లీ ఎమోషనల్, ఫ్రెండ్షిప్, లవ్ బేస్డ్ సినిమా.దర్శకుడు మంచి మెసేజ్ ఇస్తూ లవ్ ఎంటర్‌టైనర్‌ని ఎంచుకుని ఎక్కడా వల్గారిటీకి తావులేకుండా క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దారు. కాలేజ్‌లో హీరో, హీరోయిన్ల పై వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. హీరో,హీరోయిన్ల మధ్య వచ్చే లవ్,ఏమోషన్ సీన్స్ ఇవన్నీ ఇంట్రెస్టింగ్ మలిచాడు.ఈ సినిమాలో యూత్ కు కావాల్సిన అంశాలు అన్ని ఇందులో  చూయించాడు. ఇందులో వచ్చే క్లైమాక్స్ ఎమోషన్ సీన్స్ మూవీకే హైలెట్ గా నిలిచేలా చిత్రీకరించాడు. ఇఫ్తీ సంగీతమే సినిమాకి బలం. పాటలు పెద్ద మ్యూజికల్ హిట్ అయ్యాయి. కాలేజ్ వాతావరణాన్ని, స్టూడెంట్స్ ను దర్శకుడు చాలా చక్కగా చూయించాడు.సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడు క్యారెక్టర్ లో లీనమైపోతారు..ఈ సినిమాకు పెద్ద పెద్ద సింగర్స్ పాడడం జరిగింది.  ఆర్‌,ఆర్‌ సైతం ఆకట్టు కుంటుంది. సాంగ్స్ అన్ని సిచువేషన్ తగ్గట్టు ఉన్నాయి. జితిన్ స్టానిష్ లస్ కెమెరా వర్క్ బాగుంది.కేరళ, ముంబై తదితర లొకేషన్స్ ను అందంగా చూయించారు.విజువల్స్ రిచ్‌గా కనిపిస్తున్నాయి. లిజోపౌల్ ఎడిటింగ్  క్లాసీగా ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. భారీ సినిమాలు, స్టార్ హీరోల సినిమాల స్థాయిలో  అనిల్ రెడ్డి.ఎం, జయప్రకాశ్ .వి.లు ఈ సినిమాను రాజీపడకుండా మంచి క్వాలిటీతోస్ ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారని చెప్పొచ్చు.ఈ మూవీ  హీరోయిన్ రాజిష విజయన్  ఇప్పటికే తమిళంలో కర్ణన్, జైభీమ్ చిత్రాలను చేసి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగులో మాస్ మహరాజ రవితేజ చిత్రం రామారావు ఆన్ డ్యూటీ లో కూడా నటిస్తుంది. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘హలో జూన్’ చిత్రాన్ని తమిళంలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా `”హలొ జూన్” ఈ సినిమా చూసిన వారందరికీ తప్పక నచ్చుతుంది

బాటమ్ లైన్ : మంచి ఫీల్ గుడ్ మూవీ 

రివ్యూ రేటింగ్ : 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here