సినిమా : మిషన్ ఇంపాజిబుల్
విడుదల తేదీ : ఏప్రిల్ 01, 2022
నటీనటులు: తాప్సీ పన్ను, హర్ష్ రోషన్, భాను ప్రక్షన్, జయతీర్థ మొలుగు మరియు తదితరులు
దర్శకత్వం : స్వరూప్ RSJ
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
సంగీత దర్శకుడు: మార్క్ కె రాబిన్
సినిమాటోగ్రఫీ: దీపక్ యెరగరా
ఎడిటర్ : రవితేజ గిరిజాల
తొలి చిత్రం ఏజెంట్ ఆత్రేయ సినిమాను ఎంటర్‌టైనింగ్ పంథాలో చెబుతూనే మంచి మెసేజ్‌ను మిక్స్ చేసి డైరెక్ట్ చేశారు స్వరూప్. ఆ సినిమాతో దర్శకుడిగా తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఆత్రేయ సినిమాలో ఎక్కువ భాగం కంటెంట్ డ్రైవ్ మోడ్‌లో ముందుకెళ్లిన దర్శకుడు.. రెండో చిత్రమైన మిషన్ ఇంపాజిబుల్‌లో హ్యుమన్ ట్రాఫికింగ్ అనే పాయింట్‌ను తీసుకున్నారు. ఇదొక సెన్సిటివ్ పాయింట్.. డీల్ చేయడంలో ఏమాత్రం తేడా కొట్టినా ప్రేక్షకుడికి బోర్ కొట్టేస్తుంది. కాబట్టి స్వరూప్.. చిన్న పిల్లలు హ్యుమన్ ట్రాఫికింగ్‌లో ఎలా చిక్కుకున్నారు. అనే పాయింట్‌ను ఎలివేట్ చేస్తూనే ఎంటర్‌టైన్‌మెంట్‌ను మిక్స్ చేశారు. ఫస్టాఫ్ అంతా ఓ సస్పెన్స్ క్రియేట్ చేయడానికి మెయిన్ ప్లాట్‌ను రివీల్ చేయలేదు.
ఫస్టాఫ్ అంతా క్యారెక్టర్స్‌ను ఎలివేట్ చేస్తూ వచ్చారు. తాప్సీ పాత్రను, ఆమె చుట్టూ ఉండే విజయ్ రవిచంద్రన్ పాత్రలను సెకండాఫ్‌లో రివీల్ చేశారు. కానీ సినిమాలో కీలకమైన పిల్లలు హర్ష్ రోషన్, భాను ప్రకాష్, జై తీర్థ పాత్రల ఎలివేషన్ కోసం ఎక్కువ సమయం తీసుకున్నా వినోద పంధాలో సాగడంతో హాయిగా సాగిపోతుంది . దాదాపు ఫస్టాఫ్‌లో ఎక్కువ భాగం ఆ పాత్రల తీరు తెన్నులను వివరించే ప్రయత్నం చేశారు. ఓ పిల్లాడికి క్రికెట్.. మరో పిల్లాడికి మీలో ఎవరు కోటీశ్వరుడ.. ఒకడు డైరెక్టర్ కావాలని కలలు కనడం వంటి డ్రీమ్స్‌ను ఆపాదించడంతో పాటు.. ఓ పాత్రకు అబద్దాలు చెప్పే గుణాన్ని ఆపాదించడం ద్వారా సినిమా అంతా ఓ కామెడీ ట్రాక్ రన్ అయ్యేలా చూసుకున్నారు దర్శకుడు. ఇక తాప్సీ పాత్ర అయితే ఫస్టాఫ్‌లో మూడు సన్నివేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. సెకండాఫ్‌లో తాప్సీ పాత్రకు ఎక్కువ స్కోప్ ఉండేలా చూసుకున్నారు. అసలు కథను కూడా అప్పుడే మొదలవుతుంది. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు అన్నీ ఆసక్తికరంగా అనిపిస్తాయి. తాప్సీ, విజయ్ రవిచంద్రన్ సహా హర్ష్ రోషన్, భాను ప్రకాష్, జై తీర్థ తదితరులు పోటీ పడి నటించారు.
దీపక్ సినిమాటోగ్రఫీ బావుంది. మార్క్ కె.రాబిన్ అందించిన సంగీతం.. పాటలు కథలో భాగంగానే సాగుతాయి. నేపథ్య సంగీతం బాగా ఉంది.
చివరగా.. మిషన్ ఇంపాజిబుల్.. వినోదాత్మకంగా సాగుతూ ఆకట్టుకునే థ్రిల్లర్
రేటింగ్ – 3/5