‘టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ తన తదుపరి చిత్రం `మిషన్ ఇంపాజిబుల్`ను నిర్మించింది. చాలా కాలం విరామం తర్వాత తెలుగులో తాప్సీ పన్నుకు ఈ చిత్రం పునఃప్రవేశాన్ని కల్గించింది. `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` ఫేమ్ టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్జే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఈ చిత్రం హై ఎంటర్ టైన్ మెంట్ తోపాటు కొన్ని ఊహించని ట్విస్ట్ లు, కథనంలో వచ్చే మలుపులు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. కథనానికి మరింత ప్రత్యేకతను జోడించడానికి, నవీన్ పోలిశెట్టి ఈ చిత్రానికి తన వాయిస్ఓవర్ ఇవ్వడం ఖచ్చితంగా అదనపు బోనస్ అవుతుంది. విడుదలకు ముందే ట్రైలర్, టీజర్కు అద్భుతమైన స్పందన అందుకున్న ఈ చిత్రం మరింత హైప్ క్రియేట్ చేసింది.
నమ్మశక్యంగాని ఓ నిజమైన సంఘటన ఆధారంగా స్వరూప్ RSJ తన అద్భుతమైన రచన, టేకింగ్ తో కమర్షియల్ హంగులు జోడించి ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. అన్ని కమర్షియల్ అంశాలతోవుంటూ యాక్షన్, థ్రిల్లింగ్ తో కూడిన పూర్తి ఎంటర్టైనర్ గా రూపొందింది.
దీపక్ యెరగరా సినిమాటోగ్రాఫర్ కాగా, మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్.
వేసవిలో అపరిమిత వినోదాన్ని అందించడానికి `మిషన్ ఇంపాజిబుల్` ఏప్రిల్ 1న థియేటర్లలో అలరించనుంది.
తారాగణం: తాప్సీ పన్ను, రవీందర్ విజయ్, హరీష్ పరేడి, రిషబ్ శెట్టి తదితరులు
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్
రచయిత, దర్శకుడు: స్వరూప్ RSJ
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
సహ నిర్మాత: N M పాషా
సినిమాటోగ్రఫీ: దీపక్ యెరగరా
సంగీత దర్శకుడు: మార్క్ కె రాబిన్
ఎడిటర్: రవితేజ గిరిజాల
ఆర్ట్ డైరెక్టర్: నాగేంద్ర
PRO: వంశీ శేఖర్