సిద్దు జొన్నలగడ్డ, ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ చిత్రం ‘డిజె టిల్లు’ జనవరి 14 న విడుదల

0
252

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి నాయికగా టాలీవుడ్ లోని ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ‘డిజె టిల్లు’.ఈ చిత్రం జనవరి 14-2022 న విడుదల అవుతోంది. ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేస్తూ ఓ ప్రచార చిత్రాన్ని కూడా ఈరోజు విడుదల చేసింది. ప్రచార చిత్రాన్ని గమనిస్తే… నాయిక పాదాలను, కథానాయకుడు తన పెదాలతో స్పృశించటం చూస్తుంటే’డిజె టిల్లు’ ప్రేక్షకులకు ఆసక్తిని రేకెత్తిస్తోంది అనటంలో ఎంతమాత్రం సందేహం లేదనిపిస్తుంది.
ఇటీవల విడుదల అయిన’డిజె టిల్లు’ టీజర్ కూడా పూర్తిగా యువతరాన్ని ఆకట్టుకుందన్నది స్పష్టం. అందులోని దృశ్యాలు గానీ, సంభాషణలు గానీ ఆ విషయాన్ని స్పష్టం చేశాయి.

నూతన దర్శకుడువిమల్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రమిది అంటున్నారు ఆయన .

పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రాశ్రీనివాస్ నటిస్తున్నారు.

రచన: విమల్ కృష్ణ, సిద్దు జొన్నలగడ్డ
మాటలు: సిద్దు జొన్నలగడ్డ
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఛాయాగ్రహణం: సాయిప్రకాష్ ఉమ్మడి సింగు
ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలి నేని
సమర్పణ: పి. డి. వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశి
దర్శకత్వం: విమల్ కృష్ణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here