గమనం మూవీ రివ్యూ

0
778

సినిమా : గమనం
సెన్సార్ సర్టిఫికెట్ : యు
నిడివి : 1 గం 57 నిముషాలు
బ్యానర్ : క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్
నిర్మాతలు: రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుజనా రావు
ఎడిటింగ్ : రామ కృష్ణ అర్రం
సంగీతం : ఇళయరాజా
కెమెరా :జ్ఞానశేఖర్ వి.ఎస్
నటీనటులు : శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్, చారు హాసన్  తదితరులు…
విడుదల : 10-12-2021

శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం “గమనం”. ఈ సినిమాతో దర్శకురాలిగా సుజనా రావు పరిచయం అయ్యారు. క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

కథ: ప్రధానంగా మూడు పాత్రల చుట్టూ అల్లుకున్న కతే గమనం. ఇది హైదరాబాద్ మహానగరంలో మూడు ఏరియాల్లో జరిగే కథ. కమల(శ్రియ సరన్) ఓ దివ్యంగురాలు. వినికిడి లోపంతో ఇబ్బందిపడుతూ… దర్జీ పని చేస్తూ తన చిన్నారిని పోషించుకుంటూ వుంటుంది. అలాగే అలీ(శివ కందుకూరి) ఎలాగైనా మంచి క్రికెటర్ కావాలని పట్టుదలతో ప్రాక్టీసు చేస్తుంటాడు. తనని జరా(ప్రియాంక జవాల్కర్) ప్రేమిస్తూ ఉంటుంది. అయితే వీళ్ళ ప్రేమను పెద్దలు ఒప్పుకోరు. దాంతో జరా అలీ కోసం ఇంట్లో నుంచి పారిపోయి.. వచ్చేస్తుంది. అలాగే… ఓ ఇద్దరు వీధి బాలురు గుజరీ సామాను అమ్ముకొని జీవనం సాగిస్తుంటారు. అయితే వారిలో ఒకరు తన బర్త్ డే కి కేక్ కట్ చేసి గ్రాండ్ గా సెలెబ్రెట్ చేయాలనుకుంటాడు. ఇలా ఈ మూడు పాత్రలు నగరంలో కురిసిన భారీ వర్షాలకు వరదల్లో చిక్కుకుంటారు. ఆ వరదల్లో నుంచి వీళ్ళు ఎలా బయట పడ్డారు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

పాజిటివ్స్:

శ్రియ, చారు హాసన్ ల నటన
ఇళయరాజా సంగీతం
స్క్రీన్ ప్లే
సినిమాటోగ్రఫి

నెగెటివ్స్:

అక్కడక్కడ మెల్లగా సాగే కథనం

కథ… కథనం విశ్లేషణ:. నిస్సహాయతతో ఉండే మనిషికి ఒక్కసారిగా బలం వస్తే వాటిని ఎలా జయించారనేది “గమనం”. ఇలా మూడు నిస్సహాయ పాత్రల చుట్టూ అల్లుకున్న కథ.. కథనాలు.. గమనాన్ని ప్రేక్షకులను హత్తుకునేలా చేస్తాయి.. మహానగరంలో పేదల జీవితాలు ఎలా ఉంటాయో కళ్ళకు కట్టినట్లు చూపించారు. అలాగే భారీ వర్షాలు వస్తే బస్తీల్లో పేదల బతుకు ఎలా ఛిద్రం అవుతుందో బాగా చూపించారు. ప్రతి జీవి.. జీవితంలో ఎదురయ్యే ఆటు పోట్లను ఎదుర్కొని జీవితాన్ని సార్థకం చేసుకోవాలని ఓ స్ఫూర్తి దాయక “గమనం” చూపించారు దర్శకురాలు సుజనా రావు.

చివరగా: ప్రతి జీవితానికి ఒక ప్రత్యేకమైన గమనం… అందమైన ప్రయోజనం ఉంటుంది

రేటింగ్: 3.25 /5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here