సాయితేజ కుటుంబాన్ని పరామర్శించిన ‘ మా ‘ అధ్యక్షుడు మంచు విష్ణు

0
449

విధి నిర్వహణలో మృతి చెందిన జవాను సాయితేజ కుటుంబ సభ్యులను ‘ మా ‘ అధ్యక్షుడు , శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల సీఈఓ మంచు విష్ణు పరామర్శించారు . మదనపల్లిలోని ఎస్ బి ఐ కాలనీలో ఉంటున్న సాయితేజ సతీమణి శ్యామలకు ఫోన్ చేసి మాట్లాడారు . యుక్త వయస్సులోనే దేశ భద్రతను రక్షించే అత్యంత గొప్పదైన సీడీఎస్ చీఫ్ సెక్యూరిటీ అధికారిగా ఉన్న సాయితేజ అకాల మరణం పొందడం పట్ల ఆయన విచారకరం వ్యక్తం చేశారు . సాయితేజ ఇద్దరు పిల్లలు మోక్షజ్ఞ ( 05 ) . దర్శిని ( 02 ) లను తన స్వంత బిడ్డల సంరక్షిస్తానని, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల్లో వారికి పూర్తి ఉచితంగా చదువు, హాస్టల్ సౌకర్యం కల్పిస్తానని ఆయన హామి ఇచ్చారు. 10 రోజుల్లో మదనపల్లికి వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడుతానని ఆయన శ్యామలకు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here