ఊరికి ఉత్తరాన సినిమా రివ్యూ..

0
52

ఈ శుక్రవారం సుమారు గా ఒక 9 సినిమాలు రిలీజ్ అయ్యాయి అందులో ప్రచార చిత్రాలు విడుదల నుండి ప్రేక్షకులో ఆసక్తి రేకేతించిన సినిమా మాత్రం ఊరికి ఉత్తరాన

ఈ సినిమాని ఒక రైతు వనపర్తి వెంకటయ్య ప్రొడ్యూసర్ గా మారి తన కొడుకు పై ప్రేమ తో తీసిన సినిమా ఇది .. ఎలా ఉందో చూద్దాం నా సమీక్ష

ప్రేమకు మరణం లేదు కానీ ప్రేమిస్తే మరణమే.. అనే కాన్సెప్ట్ బేసిడ్ తో తెరకెక్కించిన సినిమాగా ఉంది అని చెప్పొచ్చు..హిట్ సినిమా కి కావాల్సిన మెటీరియల్ అంతా ఈ సినిమాకి ఉంది..

ఇక కధ విషయానికి వస్తే..ఆ ఊరిలో ప్రేమిస్తే మాట వినిపిస్తే చావే.ఉట్టికి వేలాడిదీసి తల పగలకొడతారు. అలాంటి కట్టుబాట్లు ఉన్న ఊర్లో.. భార్యని పోగొట్టుకొని కొడుకుతో ఉంటున్న హీరో తండ్రి పేరు నారాయణ.. లైట్ మేన్ గా పనిచేస్తుంటాడు. హీరో పని పాట లేకుండా ఊరి మీద తిరిగుతుంటూ ఉంటాడు హీరో రాజును అందరూ కరెంట్ రాజు అని పిలుస్తూఉంటారు.ఏజ్ 30 వచ్చినా పెళ్లి కాదు.. సరే పెళ్లి చేస్తే మారతాడేమో అని తండ్రి చాలా పెళ్లి సబంధాలు చూస్తుంటాడు కానీ సెట్ కావు. ఒక పక్క తండ్రి కొడుకు కోసం బాధపడుతుంటే, తండ్రి కోసం చదువుకొని ఉద్యోగం చేయాలని అనుకోని లేట్ వయసు లో కాలేజ్ కి జాయిన్ అయి.హీరోయిన్ ప్రేమ లో పడతాడు .హీరోయిన్ కూడా మెల్లగా కరెంట్ రాజును కూడా ప్రేమించడం మొదలు పెడుతుంది.ఒకరోజు నాకు హైదరాబాద్ కి తీసుకెళ్లవా చూడాలని ఉంది అని చెప్పి హీరోతో వెళ్తుంది.. కానీ తెల్లారేసరికి హీరో పక్కన కనిపించదు.. హీరో పిచివాడిలా మొత్తం వెతుకుతుంటాడు.. ఒక పక్క ఊరు లో అందరూ హీరో లేపేకెళ్లిపోయాడు అనుకోని..ఊరులోకి అడుగు పెట్టగానే చంపేయడానికి సిద్ధంగా ఉంటారు..
కానీ శైలు ఎక్కడికి వెళ్ళింది.. ఏమైంది.. మోసం చేసిందా లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా..చివరికి ఏమైంది.. వాళ్లద్దరికి ఉరి తీసారా.. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా సినిమా చూడాలి..ఎమోషన్స్ కాని, సెంటిమెంట్ కాని ,కామెడీ కాని అన్ని సమపాళ్లలో ఉంచిన సినిమా ఇది.. ఫామిలీ తో హాయిగా చూడొచ్చు..
హీరో ,హీరోయిన్ నరేన్ అండ్ దీపాలి శర్మ కొత్తవాళ్ళు అయినా చాలా బాగా చేశారు .పోటీపడి నటించారు.. హీరోయిన్ యూత్ కి కనెక్ట్ అవుద్దీ.యాక్టర్స్ చక్రపాణి గారు రామరాజు ,ఫణి,జగదీష్ ప్రతాప్,లావణ్య రెడ్డి,వారి వారి పాత్రలు కి న్యాయం చేశారు.. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంకిత్ కొయ్య ..చాలా ఈజీగా చేసాడు. కెరీర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది.

డైరెక్టర్ సతీష్ పరమవేద కి మొదటి సినిమా అయినా ఎక్కడా కన్ఫ్యూజన్ కాకుండా, అనుభవజ్ఞుడు లా సుత్తి లేకుండా చెప్పాల్సిన పాయింట్ చెప్పాడు. మ్యాటర్ ఉన్న డైరెక్టర్ దొరికాడు. పెద్ద దర్శకుడయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

పాటలు విషయానికి వస్తే ఇప్పటికే ఈ సినిమా లో పాటలు యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయాయి.. దేవేరి సాంగ్ చిత్రీకరణ బాగుంది..బీమ్స్ మరియు సురేష్ బొబ్బిలిల మ్యూజిక్ కి గుస్బాప్స్ వస్తాయి.. అద్భుతమైన సంగీతం ఇచ్చారు.
ఈ సినిమా కి బ్యాక్ బోన్.

డిఓపి శ్రీకాంత్ అరుపుల తన పనితనాన్ని చూపించాడు. విజువల్స్ బాగున్నాయి..

ఈ కరోన సెకెండ్ వే తరువాత ఇంత ఫీల్ గుడ్ అండ్ ఎమోషనల్ మూవీ రాలేదు ..ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే నేను మీకు ఇచ్చే సలహా ఊరికి ఉత్తరాన సినిమా బెస్ట్ అప్షన్..ఫ్యామిలీ తో హ్యాపీ గా చూడొవచ్చు.

రేటింగ్ 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here