“ఫ్లిక్ నైన్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్” బ్యానర్ పై త్వరలో కొత్త సినిమా ప్రారంభం

0
29

భారతదేశ పర్యాటక ప్రదేశాలలో ప్రసిద్ధి చెందిన హంపి బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరణ జరగబోవు ఈ చిత్రం, లండన్ లో చదువుకుని, నటనలో మెళుకువలు దిద్దుకుంటున్న“హృతిక్ శౌర్య” కథానాయకుడిగా.. ప్రస్తుతం కంప్యూటర్ గేమింగ్ లో MOCO గా పాపులర్ అయిన ముంబై ముద్దుగుమ్మ “కసిక కపూర్” హీరోయిన్ గా, చెన్నైలో బాక్సింగ్ లో శిక్షణ పొంది ఇండియాలోనే ఫెమస్ అయినా “షెర్లిన్ సేథ్” మరో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అవుతూ.. పాన్ ఇండియా మూవీగా అన్నీ భాషల నటీ,నటులతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఫ్లిక్ నైన్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తుంది. ప్రభాకర్ అలిగే కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు.

లవ్, యాక్షన్, క్రైమ్, సస్పెన్స్, పకడ్బందీ స్క్రీన్ ప్లే తో నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభమై, హైద్రాబాద్, హంపి, గోవాలలో మూడు షెడ్యూల్స్ తో ఐదు పాటలు. ఏడు ఫైట్స్, పది యాక్షన్ సీన్స్ తో, భారీ నిర్మాణ విలువలతో, అనుకున్న షెడ్యూల్స్ తో పూర్తిచేసి వచ్చే వేసవి సెలవులకు థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది.

ఈ చిత్రం లో సుపరిచితులైన మహానటినటులు వరలక్ష్మి శరత్ కుమార్, నరేష్, పోసాని, పవిత్రలోకేష్, సత్య, సత్యం రాజేష్, ప్రియదర్శిని, దేవి ప్రసాద్, సత్య కృష్ణ, ప్రవీణ్, శకలక శంకర్, విధ్యులేఖ రామన్, గరుడ రామచంద్రరాజు, రఘు కారుమంచి, కనిజ్ కొయిరాల, వాసు ఇంటూరి, నాగినీడు, శరత్ కేల్కర్, సంజయ్ స్వరూప్, శత్రు, హరీష్ ఉత్తమన్, అజయ్ ఘోష్, గిరిదర్, టెంపర్ వంశీ, కట్టా ఆంథోనీ, సాయికీర్తి, శ్రావణ సంధ్య.. తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ ప్రసాద్. ఎడిటర్: కార్తీక్ కె శ్రీనివాస్, సంగీతం: శేఖర్ చంద్ర, కో డైరెక్టర్: GB.నాగరాజు, ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి, కాస్ట్యూమ్ డిజైనర్: శివప్రియ, పబ్లిసిటీ డిజైనర్: సుధీర్, ప్రొడక్షన్ కంట్రోలర్: MVS వాసు, ఫైట్: డ్రాగన్ ప్రకాష్, డాన్స్: శేఖర్, జానీ, యాష్, నిర్మాణం: ఫ్లిక్ నైన్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రభాకర్ అలిగే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here