` నల్లమల ` త‌ప్ప‌కుండా వండ‌ర్స్ క్రియేట్ చేస్తుంద‌ని న‌మ్ముతున్నాను – దేవ్‌క‌ట్టా

0
473
Nallamala-Trailer-Launch

నల్లమల అడవి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటికి భిన్నంగా ఆ అడవి చుట్టూ జరిగిన ఎన్నో చీకటి కోణాలను, సామాన్య జనానికి తెలియని అవినీతి ఒప్పందాల నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర క‌థా క‌థ‌నాల‌తో తెర‌కెక్కుతోన్న చిత్రం `న‌ల్ల‌మ‌ల‌`. అమిత్‌ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ద్వారా రవి చరణ్ ‌దర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఆర్‌.ఎమ్‌ నిర్మిస్తున్న ఈ మూవీలోని సిద్ శ్రీ‌రామ్ పాడిన ఏమున్న‌వే పిల్లా సాంగ్ మిలియ‌న్స్ కి పైగా వ్యూస్ సాధించి సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా ఆ పాట‌కు ల‌క్ష‌కు పైగా క‌వ‌ర్‌సాంగ్స్ రావ‌డం విశేషం. అలాగే ఈ చిత్రంనునుండి విడుద‌లైన అన్ని పాట‌లు మిలియ‌న్ల వ్యూస్ సాధించ‌డం ఆడియ‌న్స్‌లో ఈ సినిమా క్రేజ్‌ను తెలియ‌జేస్తున్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు దేవా కట్టా విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో…

సంగీత ద‌ర్శ‌కుడు పీఆర్ మాట్లాడుతూ.. ‘టీజర్‌ను విడుదల చేసినందుకు దేవా కట్టా గారిని థ్యాంక్స్. మీ సినిమాల గురించి దర్శకుడు చెబుతుంటారు. మీరు వచ్చినందుకు థ్యాంక్స్. ఈ సినిమాలోని సాంగ్ ఫస్ట్ టైం డైరెక్టర్ గారు విన్నారు. ఆ తరువాత నేను విన్నాను. అప్పుడు ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. ఏం సాధించలేరు అని అన్న వారికి ఆ సాంగ్‌తో సమాధానం చెప్పినట్టు అయింది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడికి జీవితాంతం రుణ పడి ఉంటాను’ అని అన్నారు.

కొరియోగ్రాఫ‌ర్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. అవకాశం ఇచ్చిన దర్శకుడికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

న‌టుడు అమిత్ మాట్లాడుతూ.. ‘దేవాకట్టా టీజర్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు అన్నీ మా దర్శకుడు రవి చరణ్ గారే. ఆయన ఎంత కష్టపడ్డారో కళ్లారా చూశాను. నన్ను ఈ సినిమాలో హీరోగా పెట్టుకున్నందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మొదటిసారి ఈ కథ విన్నప్పుడే రోమాలు నిక్కబొడుచుకున్నాయి. నాకు ఏ విలన్ కారెక్టర్ ఇస్తారో.. ఏ కారెక్టర్ ఇస్తారో అని అనుకున్నాను. నా మైండ్‌లో అలానే ఉంది. ఇందులో నా పాత్ర ఏంటి అని అడిగాను. హీరో మీరే అని అన్నారు. ఆ మాటతో నేను షాక్ అయ్యాను. నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తున్నారు అంటే నమ్మలేకపోయాను. కానీ ఈ సినిమాకు నేను హీరో కాదు… కథే ఈ చిత్రానికి హీరో. కథ ఎంతో అందంగా ఉంటుంది. వాటి గురించి దర్శకుడు చెబితేనే బాగుంటుంది. ఈ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చినందుకు దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. కెమెరామెన్‌ నన్ను ఎంతో అందంగా చూపించారు. ఇప్పటికే పీఆర్ అందించిన పాట ఎన్నో మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసేసింది. భాను గారితో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. నల్లమల అద్భుతమైన స్టోరీ. మీ అందరికీ నచ్చుతుంది. టీజర్ చాలా బాగుంది. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదం మాపై ఉంటుందని నమ్ముతున్నాను“ అన్నారు.

హీరోయిన్ భాను శ్రీ‌ మాట్లాడుతూ.. ‘టీజర్ అద్భుతంగా ఉంది. దర్శకుడు రవి చరణ్‌కు నేను మొదటగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకు పల్లెటూరి పిల్లలా ఉండటం చాలా ఇష్టం. ఇలాంటి పాత్ర నాకు వస్తుందని ఊహించలేదు. నాకు ఈ కారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇది నాకు పెద్ద అవకాశం. నల్లమల సినిమాలో సిద్ శ్రీరామ్ పాడిన పాట చాలా పెద్ద హిట్ అయింది. ఎక్కడికి వెళ్లినా ఆ పాటతోనే నన్ను గుర్తిస్తున్నారు. మా టీజర్‌ను విడుదల చేసినందుకు దేవా కట్టా గారికి థ్యాంక్స్. అమిత్ గారితో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన నాకు మంచి స్నేహితుడు. కెమెరామెన్ నన్ను చాలా ఆనందంగా చూపించారు. మేకప్ వేసుకున్నా కూడా వద్దు అంటూ సహజంగా అందంగా చూపించారు. పాటల వల్లే నల్లమల అనే చిత్రం ఉందని తెలిసింది. అంత మంచి పాట ఇచ్చినందుకు మ్యూజిక్ డైరెక్టర్‌కు థ్యాంక్స్. నేను బాగా నటించాను అని ఎప్పుడూ డైరెక్టర్ గారు చెబుతుంటారు. ఇంత వరకు నేను సినిమాను చూడలేదు. థియేటర్లో చూడాలని అనుకున్నాను. ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం మా డైరెక్టర్ గారు చాలా కష్టపడ్డారు. ఈ మూవీ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్’`అన్నారు.

ద‌ర్శ‌కుడు రవి చరణ్ మాట్లాడుతూ.. ‘నాతో ఈ సినిమా చేసినందుకు, నేను ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడేలా చేసిన నిర్మాత ఆర్ఎమ్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నాకు దేవా కట్టా గారంటే చాలా ఇష్టం. టీజర్ రిలీజ్ చేసినందుకు థ్యాంక్స్. సినిమా గురించి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఓ రెండు విషయాలు చెబుతాను. అడవిని అడవి తల్లి.. గోవును గోమాత అని అంటాం. బానిస బతుకుల నుంచి భారతదేశం స్వేచ్చా ఆయువును పీల్చుకుంటున్న సమయంలో నల్లమల అడవుల్లోకి మానవ రూపంలో ఉన్న క్రూరమృగం ఎంట్రీ అయింది. ఆ మృగం ఎంట్రీ అయ్యాక ఏం జరిగింది అనేదే ఈ కథ. తరువాత సినిమా గురించి చాలా విషయాలు చెబుతాను. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్’ అని అన్నారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవాకట్టా మాట్లాడుతూ.. ‘ఇక్కడకి వచ్చినందుకు ఎంతో గౌరవంగా ఫీలవుతున్నాను. ఏమున్నావే పిల్ల‌ పాటను నేను నా ఫ్రెండ్స్‌తో హ్యాంగవుట్‌లో ఉంటే వింటాను. ఇలాంటి పాట నాకు ఒక్కటి కూడా లేదు అని అసూయ పడ్డాను. ఈ ఆడిటోరియంలోనే ఎంతో లైఫ్ ఉంది. ఇది అందరినీ బ్లెస్ చేస్తుంది. నా సినిమా రిలీజ్‌కు ఒక రోజు ముందే ఈ ఆడిటోరియంకు తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. ఆ పోస్టర్‌ను చూసి ఒక్కసారిగా ఆగిపోయాను. అమిత్‌ను మొదటిసారి చూసినప్పుడే అన్నాను. ఇంత మంచి యాక్టర్‌వి ఎందుకు అంత తక్కువగా కనిపిస్తున్నావ్ అని అన్నాను. మంచి ఫుడ్ చాలా అరుదుగా దొరుకుతుందన్నట్టుగా అనిపించింది. అజయ్ ఘోష్‌ను ప్రస్థానం సినిమాతోనే ఇంట్రడ్యూస్ చేశాను. ఆ తరువాత ఆటోనగర్ సూర్యలో కూడా ఉన్నారు. ఆ చిత్రంలో విలన్‌కు వాయిస్ ఇచ్చారు. ఇంత మంచి క్యాస్టింగ్‌ను పెట్టుకోవడంతోనే సినిమా సక్సెస్‌కు మొదటి మెట్టు పడ్డట్టు అయింది. టీంను చూస్తుంటే పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. నేను మిమ్మల్నీ ఆశీర్వదించాల్సిన అవసరం లేదు. మీ పాజిటివిటీనే నేను తీసుకోవాలనేట్టు ఉంది. ఈ సినిమా వండ‌ర్స్ క్రియేట్ చేస్తుంద‌ని న‌మ్ముతున్నాను. నన్ను ఇక్కడికి పిలిచినందుకు థ్యాంక్స్. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్‌’ అని అన్నారు.

నటీన‌టులు: అమిత్ తివారి, భానుశ్రీ‌, నాజ‌ర్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, అజ‌య్ ఘోష్‌, కాశీ విశ్వ‌నాథ్‌, కాల‌కేయ ప్ర‌భాక‌ర్‌, ఛలాకీ చంటి, శుభోద‌యం రాజ‌శేఖ‌ర్‌, చ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌, ముక్కు అవినాష్‌, శేఖ‌ర్ అలీ, అరోహి నాయుడు, అసిరి శ్రీ‌ను

సాంకేతికంగానూ హై స్టాండర్డ్స్ లో నిలిచే ఈ మూవీకి
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవి చరణ్
నిర్మాత: ఆర్.ఎమ్
సినిమాటోగ్రఫీ: వేణు మురళి
సంగీతం, పాటలు: పి.ఆర్
ఎడిటర్: శివ సర్వాణి
ఆర్ట్: పీవీ రాజు
ఫైట్స్: నబా
స్టైలిస్ట్‌: శోభ ర‌విచ‌ర‌ణ్‌
విఎఫ్ఎక్స్: విజయ్ రాజ్
పిఆర్ఓ – శ్రీ‌ను – సిద్ధు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here