‘బీస్ట్’ నెల్సన్ దర్శకత్వంలో ‘డాక్టర్ వరుణ్’ గా శివ కార్తికేయన్

0
356

శివ కార్తికేయన్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెలుగు – తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘ డాక్టర్’ . ఈ చిత్రాన్ని విజయదశమి సందర్బంగా అక్టోబర్ 9th న తెలుగునాట ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు. కే. జె. ఆర్ స్టూడియోస్ కోటపాడి జే రాజేష్ ఈ చిత్రాన్ని గంగ ఎంటర్టైన్మెంట్స్ , ఎస్ కె ప్రొడక్షన్స్ తో సంయుక్తంగా నిర్మించారు. ఇదివరకే విడుదలైన తమిళ పాటలు, అనిరుధ్ సంగీతం చిత్రంపై విపరీతమైన అంచనాలు పెంచగా, తెలుగులో కూడా పాటల్ని త్వరలోనే విడుదల చేయనున్నారు. ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించగా , వినయ్ రాయ్ విలన్ గా చేశారు.

ఈ సందర్బంగా నిర్మాత కోటపాడి జె రాజేష్ మాట్లాడుతూ, “మా చిత్రం మంచి మాస్ ఎంటర్టైనర్. ప్రస్తుతం విజయ్ హీరోగా ‘బీస్ట్ ‘ చిత్రాన్ని చేస్తున్న నెల్సన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. శివకార్తికేయన్ తో ఇదివరకు మేము తీసిన ‘శక్తి’ అనే చిత్రం మంచి హిట్ అయ్యి మాకు లాభాల పంట పండించింది. ఈ చిత్రం కూడా అలాగే సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తూ అక్టోబర్ 9th న ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాం. ప్రేక్షకుల అంచనాలని మించి ఈ చిత్రం ఉంటుందని మాత్రం కచ్చితంగా చెప్పగలం” అన్నారు

డైరెక్టర్ నెల్సన్ మాట్లాడుతూ– “శివకార్తికేయన్ – అనిరుధ్ కాంబినేషన్ తో మంచి మాస్ ఎంటర్టైనర్ కథతో తెరకెక్కిన చిత్రం ఇది. డాక్టర్ వరుణ్ గా శివ కార్తికేయన్ నవరసాలు చూపించారు. ఎన్నో ఒడిదుడుకుల తరువాత చిత్రం థియేటర్స్ లో అక్టోబర్ 9th న విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులని నూటికి నూరు శాతం అలరిస్తుంది.ప్రస్తుతం విజయ్ తో ‘బీస్ట్’ చిత్రం చేస్తున్నా” అన్నారు.

సినిమాటోగ్రఫీ : విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటర్ : ఆర్. నిర్మల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here