హీరో విశాల్ ప్రస్తుతం ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం నూతన దర్శకుడు తు.పా శరవణన్ తో జతకట్టారు. విశాల్ స్వయంగా తన విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ (VFF) బ్యానర్ పై ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మిస్తున్నారు.
విశాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. విశాల్ 31వ చిత్రం టైటిల్ `సామాన్యుడు`. ఇది `నాట్ ఎ కామన్ మ్యాన్` అనేది ట్యాగ్ లైన్.
ఈ సందర్భంగా రిలీజ్‌చేసిన పోస్టర్ లో రౌడీల బ్యాచ్ ని బేస్ బాల్ బ్యాట్ తో చితక్కొడుతూ విశాల్ ఎగ్రెస్సివ్ గా కనిపిస్తున్నారు. ఈ మరియు పోస్టర్ అతను ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ అని ట్యాగ్‌లైన్‌ను సమర్థిస్తుంది.
విశాల్ సరసన డింపుల్ హయతి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో యోగి బాబు- బాబురాజ్ జాకబ్- పిఎ తులసి-రవీనా రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
విశాల్ కి పలు చార్ట్ బస్టర్ ఆల్బమ్ లను అందించిన యువన్ శంకర్ రాజా సామన్యుడు చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కవిన్ రాజ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
`సామాన్యుడు` త్వరలో థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.
తారాగణం:
విశాల్, డింపుల్ హయాతి, యోగిబాబు, బాబురాజ్ జాకబ్, పి.ఎ.తులసి, రవీనా రవి
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: తు.ప శరవణన్
నిర్మాత: విశాల్
సంగీతం: యువన్ శంకర్‌రాజా
డిఒపి: కవిన్‌రాజ్
ఎడిటర్: ఎన్.బి శ్రీకాంత్
ఆర్ట్: ఎస్ ఎస్ మూర్తి
కాస్ట్యూమ్ డిజైనర్: వాసుకి భాస్కర్
పబ్లిసిటీ డిజైన్: విక్రమ్ డిజైన్స్.