‘1997’ చిత్రంలోని నవీన్ చంద్ర లుక్ విడుదల చేసిన హీరో విశ్వక్ సేన్

0
180

డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయదర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న బిన్నమైన కథా చిత్రం 1997. ఈ చిత్రానికి సంబందించిన ముడు ముఖ్య పాత్రల్లో ఒకటైన నవీన్ చంద్ర లుక్ ని యంగ్ అండ్ క్రేజీ హీరో విశ్వక్ సేన్ విడుదల చేసారు.

అనంతరం విశ్వక్ సేన్ మాట్లాడుతూ .. 1997 లో జగపతి పాత్రలో నవీన్ చంద్ర లుక్ ని విడుదల చేశాను. నేను పుట్టినతరువాత రెండేళ్లకు 1997 వచ్చింది. నవీన్ లుక్ బాగుంది .. తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం అందుకోవాలి. మోహన్ గారికి ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలి, ఈ సినిమా టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను అన్నారు.

హీరో, దర్శకులు డాక్టర్ మోహన్ మాట్లాడుతూ .. ఈ సినిమాలో ఉన్న మూడు ముఖ్యపాత్రల్లో నవీన్ చంద్ర పాత్రను రివీల్ చేసినందుకు మా హీరో విశ్వక్ సేన్ గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సందర్బంగా విశ్వక్ సేన్ నటిస్తున్న పాగల్ సినిమా పెద్ద విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఓ బర్నింగ్ ఇష్యుని తీసుకుని ఈ సినిమా చేశా. ఈ సినిమా విషయంలో నాకు ప్రతి విషయంలో సపోర్ట్ అందించిన కోటి గారికి థాంక్స్ చెప్పాలి. అలాగే ఇందులో నటించిన నవీన్ చంద్రకు థాంక్స్ చెప్పాలి. కథ వినగానే వెంటనే చేస్తానని చెప్పారు. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది. అలాగే నా ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.

నటీనటులు.
డా. మోహన్, నవీన్ చంద్ర , అయ్యంగార్, కోటి, బెనర్జీ, , రవి ప్రకాష్, రామ రాజు తదితరులు…

బ్యానర్ : ఈశ్వర పార్వతి మూవీస్.
ఎడిటింగ్ : నందమూరి హరి
సంగీతం : కోటి
కెమెరా : చిట్టి బాబు
నిర్మాత: మీనాక్షి రమావత్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: డాక్టర్ మోహన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here