సుమంత్, నైనా గంగూలీ జంటగా టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో రెడ్ సినిమాస్ బ్యానర్‌పై కె.రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘మళ్ళీ మొదలైంది’. ఈ సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్నఈ చిత్రంలో ఇన్‌స్పిరేషనల్ సింగిల్ మదర్ పాత్రలో నటిస్తోన్న సుహాసిన లుక్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు సినిమాలో మరో కీలక పాత్రకు సంబంధించిన లుక్‌ను విడుదల చేసింది. ఆ కీలక పాత్ర చేసిందెవరో కాదు.. స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్. తక్కువగా మోటివేట్ చేస్తూ, ఎక్కువగా కన్‌ఫ్యూజ్ చేసే కిషోర్ అనే ఫ్రెండ్ పాత్రలో వెన్నెల కిషోర్ కనిపించనున్నారు.
రీసెంట్‌గా ..కుటుంబం, సభ్యుల మధ్య ఉండే లవ్ అండ్ ఎమోషన్స్‌తో పాటు భార్యభర్తల మధ్య ఉండే అనుబంధాన్ని ఎలివేట్ చేసేలా ఈ సినిమా ఉండబోతుందని తెలిసేలా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
సుహాసిని మణిరత్నం, వెన్నెల కిషోర్, మంజుల ఘట్టమనేని, పోసాని కృష్ణ మురళి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. జీఆర్ఎన్ సినిమాటోగ్రాఫర్.
నటీనటులు:
సుమంత్, నైనా గంగూలి, సుహాసిని మణిరత్నం, వెన్నెల కిషోర్, మంజుల ఘట్టమనేని, పోసాని కృష్ణ మురళి తదితరులు
సాంకేతిక వర్గం:
రచన, దర్శకత్వం: టీజీ కీర్తి కుమార్
నిర్మాత: కె. రాజశేఖర్ రెడ్డి
సంగీతం: అనూప్ రూబెన్స్
ఎడిటింగ్: ప్రదీప్ ఇ రాఘవ్
ఆర్ట్: అర్జున్ సురిశెట్టి
సీఈఒ: చరణ్ తేజ్