నార‌ప్ప నా కెరీర్‌లో మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్ట‌ర్ – విక్ట‌రీ వెంక‌టేష్‌

0
468

విక్టరీ వెంకటేష్, ప్రియ‌మ‌ణి హీరో హీరోయిన్లుగా శ్రీకాంత్‌ అడ్డాల కాంబినేషన్‌లో రూపొందిన మాస్ అండ్ యాక్ష‌న్ ఎంటర్‌టైనర్‌ ‘నారప్ప’. డి. సురేష్‌బాబు, కలైపులి యస్‌ థాను సంయుక్తంగా నిర్మించిన ‘నారప్ప’ చిత్రం ఈ నెల 20 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సంద‌ర్భంగా విక్టరీ వెంక‌టేష్ మీడియాతో మాట్లాడారు ఆ విశేషాలు..

నార‌ప్ప డైరెక్ట్‌గా ఓటీటీలో విడుద‌ల‌వుతున్న మీ మొద‌టిసినిమా క‌దా..ఎలా అన్పిస్తోంది?
– సాధార‌ణంగా ఎవ‌రికైనా కొన్ని ఫ‌స్ట్ థింగ్స్ అంటూ ఉంటాయి. అలాగే ఇది కూడా నా లైఫ్‌లో ఫ‌స్ట్ టైమ్ అనుకుంటాను త‌ప్ప ఇలాంటి వాటి గురించి మ‌రీ ఎక్కువ‌గా ఆలోచించ‌ను.

ఈ సినిమా చేయ‌డానికి మిమ్మ‌ల్ని ప్రభావితం చేసిన అంశాలేంటి?
– ‘అసురన్‌’ సినిమా చూడగానే తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అవుతుందనిపించింది. అన్నయ్య సురేశ్‌కు కూడా ఇందులో ఏదో ఉందనిపించింది. క్యారెక్టర్‌లోకి లోతుగా వెళితే గట్‌ ఫీలింగ్‌ కలిగింది. గతంలో ఎన్నో రీమేక్‌ సినిమాల్లో నటించినా ఇది మాత్రం చాలా కొత్తగా అనిపించింది. ‘నారప్ప’ పాత్ర నాకు సవాల్‌ విసిరింది. అందుకే ఒరిజ‌న‌ల్‌ చూశాక ఒక్క క్షణం ఆలోచించకుండా సినిమా అంగీకరించాను. ఇలాంటి ఒక మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్ట‌ర్ ఇచ్చిన ధనుష్‌, వెట్రిమారన్ కి కంగ్రాట్స్ చెప్పాలి.

ఈ మూవీలో మీకు బాగా ఛాలెంజింగ్‌గా అనిపించిన స‌న్నివేశాలేంటి?
– ఫ‌స్ట్ నారప్ప క్యారెక్ట‌ర్ చేయ‌డ‌మే నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది. చాలా కాలం తర్వాత సాలిడ్ ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్ లు కానీ, గెటప్ అన్నీ చాలా ఛాలెంజింగ్ గా అనిపించాయి. నార్మ‌ల్‌గా నేను అలాంటి యాక్టర్ ని కాదు.. కానీ ఈ సినిమాకి ఎందుకో అలా చేయాలనిపించింది. నారప్ప పాత్ర కోసం మేకప్‌ లేకుండా నటించా. 50 రోజులపాటు హోటల్‌ రూమ్‌లో అదే గెటప్‌లో ఉన్నా. కథకు కావలసినట్లు బాడీ లాంగ్వేజ్‌ మార్చుకున్నా. శారీరకంగా, మానసికంగా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డా.

రీమేక్ అన‌గానే కంపారిజ‌న్స్ వ‌స్తాయోమో క‌దా?
– ఖచ్చితంగా వ‌స్తాయి అని నాకు తెలుసు. ఎందుకంటే ఏ రీమేక్ సినిమాకి అయినా కంపేరిజన్ అనేది ఉంటుంది. సుందరాకాండ, చంటి వంటి సినిమాలు రీమేక్స్ అయిన‌ప్ప‌టికీ వాటిలో చాలా మార్పులు ఉంటాయి. అలాగే నారప్ప చిత్రాన్ని కూడా మ‌న నేటివిటీకి త‌గ్గ‌ట్లు మార్పులు చేశాం. నాతో సినిమాలో ప్రియ‌మ‌ణి స‌హా అందరు యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. ఏదైనా సరే ఫైనల్ గా అతను ధనుష్, నేను వెంకటేష్. అతను కూడా అవుట్ స్టాండింగ్ జాబ్ ఇచ్చాడు. ఇక్కడ నారప్ప ఎమోషన్స్ ఏంటి అన్నది ముఖ్యం అది నేను చూపించాను.

శ్రీకాంత్ అడ్డాల ఇప్ప‌టివ‌ర‌కు ఫ్యామిలీ చిత్రాల‌నే ఎక్కువ‌గా చేశారు…కాని మాస్ అండ్ యాక్ష‌న్ ఫిలింకి ఆయ‌నను డైర‌క్ట‌ర్‌గా తీసుకోవడానికి రీజనేంటి?
– శ్రీకాంత్ అడ్డాల ‘అసురన్’ సినిమా చూసి తెలుగు రీమేక్ ని డైరెక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడు. నాతో ఆల్రెడీ ఒక మంచి సినిమాకి వర్క్ చేసిన శ్రీకాంత్ ఈ ప్రాజెక్ట్ లో భాగం అయితే బాగుంటుంది అనుకున్నాం. ఆల్రెడీ హిట్ స‌బ్జెక్ట్‌ అయినా దాన్ని అడాప్ట్ చేసుకొని.. తెలుగులో చెప్పడాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు. త‌న ప‌ని త‌ను చాలా బాగా చేశాడు.

ఈ క‌రోనా మీలో ఎలాంటి మార్పులు తీసుకువ‌చ్చింది?
– కరోనా కారణంగా ప్రపంచం మొత్తం అస్తవ్యస్తం అయింది. ఈసారి ప్రకృతి పిలుపు మామూలుగా లేదు. మంచైనా, చెడైనా మనం చేసిన దానికి పర్యావసానం ఉంటుంది అంటారు! ప్రకృతి కరోనా రూపంలో విలయ తాండవం చేసింది. జనమంతా ‘మాకేం వద్దు.. ఆరోగ్యంగా ఉంటే చాలు’ అనుకున్నారు. కరోనా జనాల్లో చాలా మార్పు తీసుకొచ్చింది. పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే అవన్నీ మరచిపోతున్నాం. మన చేతుల్లో ఏదీ ఉండదు. ఇప్పుడు జనాలకు లైఫ్‌ సీక్రెట్‌ అంతా తెలిసిపోయింది.

మణిశర్మగారితో మీ కెరీర్ స్టార్టింగ్ నుండి వ‌ర్క్ చేస్తున్నారు క‌దా..?
– మణి తో నా మొదటి సినిమా నుంచి కూడా మంచి మ్యూజిక్ ఇస్తూనే ఉన్నాడు, అలాగే ఈ సినిమాకి కూడా మంచి స్కోర్ ఇచ్చాడు.

ఫైన‌ల్ ఔట్‌పుట్ చూశాక మీ ఫీలింగ్ ఏంటి?
– నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా చెప్పాలంటే నా కెరీర్ లో ది బెస్ట్ ఈ సినిమాకి ఇచ్చా.. త‌ప్ప‌కుండా మీ అంద‌రికీ న‌చ్చుతుంది అనిపించింది.

ఒకేసారి మూడు డిఫ‌రెంట్ మూవీస్ చేయ‌డం ఎలా ఫీల‌వుతున్నారు?
– అలా జ‌ర‌గడం మ‌న చేతుల్లో ఏమీ ఉండ‌దు. కాక‌పోతే దానికి నేను చాలా లక్కీ అని భావిస్తున్నాను. నేను ఏ సినిమా షూటింగ్ చేసినా అయిపోగానే వెంటనే ఆ పాత్ర నుంచి బయటకు వచ్చేస్తాను. ‘నారప్ప’ ‘దృశ్యం 2’ ‘ఎఫ్ 3’ వేటికవే ప్రత్యేకమైనవి. అలా మూడు భిన్న‌మైన‌ సినిమాలు చేస్తున్నందుకు నేను లక్కీ.

* కరోనా కారణంగా నార‌ప్ప సినిమాను ఓటీటీలో విడుదల చేయాల్సి వస్తుంది. దీని వల్ల అభిమానులు చాలామంది బాధపడ్డారు. కానీ పరిస్థితులను బట్టి తప్పలేదు. అందుకు అభిమానులకు సారీ చెబుతున్నా. ఇదొక కొత్త అనుభవంగా భావిస్తున్నా. అప్పుడప్పుడు కొత్త మార్పులను స్వాగతించాలి. ఓటీటీ అభివృద్ది చెందడం కూడా మంచి పరిణామమే. కరోనా తగ్గి థియేటర్లు తెరచుకుని పాత రోజులు వస్తాయని ఆశిస్తున్నా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here