ఆది సాయికుమార్ చేతుల మీదుగా “గ్రేట్ శంకర్” మూవీ టీజర్ విడుదల

0
480

మలయాళంలో మమ్ముట్టి హీరోగా నటించిన “మాస్టర్ పీస్” సినిమా టాలీవుడ్ లోకి “గ్రేట్ శంకర్” పేరుతో రాబోతోంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన “మాస్టర్ పీస్” మలయాళంలో సూపర్ హిట్ విజయాన్ని సాధించింది. అజయ్ వాసుదేవ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని “గ్రేట్ శంకర్” గా శ్రీ ఎల్ వీఆర్ ప్రొడక్షన్స్ పై నిర్మాత లగడపాటి శ్రీనివాస్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఎల్ భార్గవ్ (నాని) ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. “గ్రేట్ శంకర్” సినిమా టీజర్ ను యంగ్ హీరో ఆది సాయికుమార్ శనివారం ఉదయం 11 గంటలకు విడుదల చేశారు.

అనంతరం ఆది మాట్లాడుతూ…ఇండియన్ సినిమాలో మమ్ముట్టి వన్ ఆఫ్ ద గ్రేట్ స్టార్. ఆయన నటించిన “గ్రేట్ శంకర్” సినిమా టీజర్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. సినిమా టీజర్ చాలా బాగుంది. చిత్ర నిర్మాత లగడపాటి శ్రీనివాస్, ఇతర టీమ్ కు ఆల్ ద బెస్ట్. అన్నారు.

నిర్మాత లగడపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ…మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన “మాస్టర్ పీస్” సినిమాను తెలుగులోకి “గ్రేట్ శంకర్” పేరుతో రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. తమిళంలో విజయ్ “మాస్టర్” సినిమాలా “గ్రేట్ శంకర్” కూడా యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకుంటుంది. ఇటీవల “క్రాక్” చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపిస్తారు. అలాగే హీరోయిన్ పూనమ్ బజ్వా క్యారెక్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. “గ్రేట్ శంకర్” సినిమా టీజర్ రిలీజ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన హీరో ఆది గారికి థాంక్స్. అన్నారు.

నటీనటులు : మమ్ముట్టి, పూనమ్ బజ్వా, వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ తదితరులు

సాంకేతిక నిపుణులు : సంగీతం – దీపక్ దేవ్, సినిమాటోగ్రఫీ – వినోద్ ఇల్లంపల్లి, ఎడిటింగ్ – జాన్ కుట్టి, స్టంట్స్ – స్టంట్స్ శివ, దిలీప్ సుబ్రయాన్, నిర్మాత – లగడపాటి శ్రీనివాస్, దర్శకత్వం – అజయ్ వాసుదేవ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here