ప్రముఖ సినీ జర్నలిస్ట్ ,దర్శక రచయిత ప్రభు ” నేటి భారతం ” టైటిల్ తో కరోనా క్రైసిస్ నేపధ్యంలో రచించిన పవర్ ఫుల్ రన్నింగ్ కామెంటరీ ఇది. కరోనా కారణంగా ఉత్పన్నమైన దుర్భర పరిస్థితులను ,ప్రభుత్వాల ,వ్యక్తుల,వ్యవస్థల వైఫల్యాలను నిలదీస్తూ సాగిన ఈ రన్నింగ్ కామెంటరీ ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతుంది. వృత్తి రీత్యా ఫిల్మ్ జర్నలిస్ట్ అయినప్పటికీ సమకాలీన సామాజిక ,రాజకీయ అంశాల పట్ల ఆవేదనతో, ఆవేశంతో ప్రభు చేసిన ఈ రచన ఆలోచింప చేసేదిగా ఉంది .



