నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని, మైత్రి మూవీ మేకర్స్ #NBK107 త్వరలో వేట మొదలు..

0
154

మాస్ డెమి గాడ్ న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ– మాస్ ప‌ల్స్ బాగా తెలిసిన గోపీచంద్ మలినేని కాంబినేష‌న్ లో ఒక పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కబోతోంది. ఇటీవల క్రాక్ తో భారీ బ్లాక్ బస్టర్ సాధించిన గోపీచంద్ మ‌లినేని బాలకృష్ణ కోసం నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశారు. బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబినేష‌న్ అన‌గానే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో, అభిమానుల్లో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును భారీ బ‌డ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. నటసింహా బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఇంట్రో వీడియోతో #NBK107 ని అధికారికంగా ప్రకటించారు. బాలయ్య ఇమేజ్ కి త‌గ్గ‌ట్టుగా ఈ వీడియోలో సింహం వేటాడేందుకు సిద్ధ‌మ‌వుతోందని రివీల్ చేశారు మేకర్స్. నడిచివస్తున్న సింహంలో బాలకృష్ణ ముఖాన్ని చూడవచ్చు. ఈ చిత్రంలో బాలకృష్ణ శక్తివంతమైన పాత్రలో న‌టిస్తున్నార‌ని చెప్పేందుకే అలా సింబాలిక్ గా చూపించారు. ఎస్.ఎస్.థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

#NBK107 హంట్ స్టార్ట్స్.. అని మేకర్స్ వెల్లడించారు. త్వరలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

తారాగణం: నందమూరి బాలకృష్ణ

సాంకేతిక వర్గం:
దర్శకత్వం: గోపిచంద్ మలినేని
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవి శంకర్
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
సంగీతం: తమన్ ఎస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here