సీనియర్ సభ్యులు BA రాజు కుటుంబానికి ఎఫ్‌సిఏ సహకారం!

0
16

గత కొన్ని సంవత్సరాలుగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ (ఎఫ్.సి.ఎ) సభ్యులు ఎవరైనా మరణిస్తే, వారి కుటుంబానికి తక్షణ సాయంగా రూ. 25 వేలను అసోసియేషన్ అందిస్తోంది. అందులో భాగంగా, ఇటీవల అనారోగ్యంగా కన్నుమూసిన ఎఫ్.సి.ఎ. సీనియర్ సభ్యులు, స్వర్గీయ BA రాజు కుటుంబాన్ని కలిసి, పరామర్శించి రూ. 25 వేల చెక్కుని అందచేసింది. ‘రాజు గారి మరణం జర్నలిస్టు కుటుంబానికే కాకుండా సినీ పరిశ్రమకు, పి ఆర్ ఓ కుటుంబాలకీ తీరని లోటు’ అని ఎఫ్.సి.ఎ. అధ్యక్షులు శ్రీ సురేశ్ కొండేటి అన్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని ప్రధాన కార్యదర్శి ఇ. జనార్దన్ రెడ్డి తెలియచేశారు. రాజు లేని లోటు వారి కుటుంబానికి తీర్చలేనిది. వారికి అవసరమైన సాయం చేయడానికి ఎఫ్.ఎ.సి. ముందు ఉంటుందని జాయింట్ సెక్రెటరీ పర్వతనేని రాంబాబు చెప్పారు. స్వర్గీయ రాజు కుమారులు అరుణ్ కుమార్, శివ కుమార్ తో పాటు ఎఫ్.సి.ఎ. సీనియర్ సభ్యులు ప్రభు మరియు రాంబాబు వర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇట్లు

సురేష్ కొండేటి
అద్యక్షడు ..

ఇ.జనార్ధన్ రెడ్డి
ప్రధాన కార్యదర్శి
కార్యవర్గం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here