‘థాంక్యూ బ్రదర్’ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తున్నందుకు హ్యాపీగా ఉంది – విరాజ్ అశ్విన్‌

0
338

అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, విరాజ్ అశ్విన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ‘థాంక్యూ బ్రదర్’. ర‌మేష్ రాప‌ర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఇటీవ‌ల ఆహాలో విడుద‌లై పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సంద‌ర్భంగా విరాజ్ అశ్విన్ మీడియాతో ముచ్చ‌టించారు ఆ విశేషాలు..

మూవీ రిలీజైన త‌ర్వాత రెస్పాన్స్ ఎలా ఉంది?
– రెస్పాన్స్ చాలా బాగుంది. నాకైతే చాలా హ్య‌పీగా ఉంది. ప్ర‌తి ఒక్క‌రు సినిమా గురించి చాలా పాజిటివ్‌గా మాట్లాడు తున్నారు. అలాగే అన‌సూయగారి యాక్టింగ్ మ‌రియు నా యాక్టింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఫ్రెండ్స్, వెల్ విష‌ర్స్‌ ఫోన్ చేసి అభి క్యారెక్ట‌ర్‌ చాలా బాగా చేశావు అని విష్ చేస్తున్నారు. మొత్తానికి చాలా సంతోషంగా ఉంది.

చాలా మంది విష్ చేస్తున్నారు అని చెప్పారు క‌దా మీకు వ‌చ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు?
– హానెస్ట్‌గా చెప్పాలంటే మా అమ్మ‌గారి ద‌గ్గ‌ర నుండి వ‌చ్చింది. త‌ను సినిమా చూసి చెప్పిన ఫ‌స్ట్ థింగ్ ఏంటంటే క్లైమాక్స్ లో నీ యాక్టింగ్ చూసి నాకు నిజంగా ఏడుపు వ‌చ్చింది అంత బాగా చేశావు అని చెప్పి న‌న్ను హ‌గ్ చేసుకుని ఏడ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు నా లైఫ్‌లో జరిగిన బెస్ట్ థింగ్ అదే..

ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట‌య్యింది?
– లాక్‌డౌన్ త‌ర్వాత ర‌మేష్‌గారు ఫోన్ చేసి ఇలా ఒక మూవీ అనుకుంటున్నాం. నిన్ను ఒక సారి క‌ల‌వాలి అని చెప్తే వెళ్లి క‌లిశాను. అభి క్యారెక్టర్‌కి నువ్వు రైట్ ప‌ర్స‌న్ అని అనుకుంటున్నాం అని చెప్పి స్క్రిప్ట్ నేరేట్ చేశారు. స్క్రిప్ట్ విన‌గానే బాగా న‌చ్చింది వెంట‌నే ఓకే చెప్పాను. అలా లాక్‌డౌన్ అయిన వెంట‌నే షూట్ స్టార్ట్ చేశాం.

అభి క్యారెక్ట‌ర్‌లో చాలా షేడ్స్ ఉన్నాయి..కెరీర్ బిగినింగ్ స్టేజ్‌లోనే ఇలాంటి క్యారెక్ట‌ర్ చేయ‌డం రిస్క్ అనిపించ‌లేదా?
– జెన్యూన్‌గా చెప్పాలంటే ర‌మేష్ గారు నేరేట్ చేస్తున్న‌ప్పుడు నాకు కూడా మొద‌ట్లో కొంచెం భ‌యం వేసింది. ఎందుకంటే ముందు ఒక ప్లే బాయ్ క్యారెక్ట‌ర్ ప్లే చేయాలి. కెరీర్ ఇన్షియ‌ల్ స్టేజ్‌లోనే ఇలాంటి క్యారెక్ట‌ర్ అంటే ఎలా? ఆడియ‌న్స్‌లో బ్యాడ్‌నేమ్ వ‌స్తుందేమో అనుకున్నా.. కాని ఎప్పుడైతే అభి క్యారెక్ట‌ర్‌లో ఆ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ మొద‌ల‌ వుతుందో అప్పుడే ఆ క్యారెక్ట‌ర్‌కి బాగా క‌నెక్ట్ అయ్యాను. నాకు తెలీకుండానే ఆ క్యారెక్ట‌ర్‌ని ఇష్ట‌ప‌డ‌డం స్టార్ట్ చేశాను. ముఖ్యంగా సినిమాలో ఆ బేబి బ‌య‌ట‌కు వ‌స్తుందో అప్పుడే కొత్త అభి కూడా బ‌య‌ట‌కు వ‌స్తాడు. అభి కూడా మ‌ళ్లీ పుట్టాడు అని సింబాలిక్‌గా చూపించాం.

అన‌సూయ‌తో వ‌ర్క్ చేయ‌డం ఎలా అనిపించింది?
– అన‌సూయగారు చాలా స్వీట్ హార్టెడ్ ప‌ర్స‌న్‌. ఈ మూవీకి ముందు త‌న‌తో నాకు ప‌రిచ‌యం లేదు. అభి, ప్రియ క్యారెక్ట‌ర్స్‌ మ‌ధ్యే చాలా ఇంపార్టెంట్ సీన్స్ ఉంటాయి. కాబ‌ట్టి ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను .సెట్ వెళ్ల‌గానే ఫ‌స్ట్‌డే అన‌సూయ‌గారితోనే నా సీన్‌. ఆ సీన్ చేయ‌గానే ఓకే ఈ సినిమా త‌ప్ప‌కుండా వ‌ర్కౌట్ అవుతుంది అనుకు న్నాను అంత ఈజీగా క‌లిసిపోయారు. అన‌సూయ‌గారు సెట్లో చాలా ఫ‌న్ గా ఉంటారు. మా టీమ్ అంద‌రం చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాం.

డైరెక్ట‌ర్ ర‌మేష్ మేకింగ్ స్టైల్ గురించి?
– ర‌మేష్‌గారు నేను ఇప్ప‌టివ‌ర‌కూ చూసిన వారిలో కూలెస్ట్ ప‌ర్స‌న్‌. ఎలాంటి సీన్ అయినా చాలా కూల్‌గా హ్యాండిల్ చేస్తారు. త‌ను నైజీరియాలో ఫిలిం ఇండ‌స్ట్రీలో వ‌ర్క్ చేసి వ‌చ్చారు కాబ‌ట్టి త‌న‌కు ఏం కావాలి అనే దానిపై ఫుల్ క్లారిటి ఉంది. ఎక్క‌డా ఇది త‌న ఫ‌స్ట్ మూవీ అనే ఫిలింగ్ రాలేదు. చాలా ఎక్స్‌పీరియ‌న్స్‌డ్ డైరెక్ట‌ర్‌లానే డీల్‌చేశారు.

ఈ సినిమా థియేట‌ర్‌లో కాకుండా ఓటీటీలో విడుద‌లైంది క‌దా ఎమైనా అప్‌సెట్ అయ్యారా?
– క‌చ్చితంగా కొంచెం డిస‌ప్పాయింట్‌మెంట్ ఉంది. ఎందుకంటే థియేట‌ర్లో ఆడియ‌న్స్ మ‌ధ్య కూర్చొని మ‌న‌ల్ని మ‌నం చూసుకుంటున్న‌ప్పుడు ఆ ఫీలింగ్ నెక్ట్స్ లెవ‌ల్ ఉంటుంది. అది మిస్ అయినందుకు చిన్న బాధ. అయితే ఆహాలో రిలైజ‌న త‌ర్వాత ఇంత‌మంచి రెస్పాన్స్ వ‌స్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది.

ప్రేక్షకులు మెచ్చుకుంటున్న ‘థ్యాంక్యూ..బ్రదర్‌’ లాంటి ఓ ఎమోషనల్‌ సినిమా చేశారు. ఇకపై హీరోగా ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు?
– కథలో నటించడానికి ఆస్కారం ఉండి, నాకు నచ్చిన ఏ సినిమాను, ఏ పాత్రను కూడా నేను వదులుకోను.
‘థ్యాంక్యూ..బ్రదర్‌’ సినిమా అలా నచ్చి చేసిందే. స్క్రిప్ట్, క్యారెక్టర్‌ను బట్టి నేను సినిమాలు ఒప్పుకుంటు న్నాను. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే…ఒక మంచి సినిమా రావలంటే టీమ్‌ సపోర్ట్‌ కూడా ఉండాలని నేను భావిస్తాను. కొత్తవాళ్లా, పాతవాళ్లా…ఆ సినిమాను ఏ బడ్జెట్‌లో చేస్తున్నాం..అన్న అంశాలను పక్కన పెడితే ఓ మంచి టీమ్‌లో నా భాగస్వామ్యం ఉండేందుకు నేను ఇష్టపడతాను.

మీ యాక్టింగ్‌తో పాటుగా….విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్, ఆర్ట్‌ డైరెక్షన్‌ ఈ మూడు అంశాలును ఆడియన్స్‌ మెచ్చుకుంటున్నారు. ఈ సినిమాకు టెక్నీషియ‌న్స్ స‌పోర్ట్ ఎంత‌వ‌ర‌కు హెల్ప్ అయింది?
– ఒక మంచి టీమ్‌తో నేను వర్క్‌ చేశాను. గుణ మంచి సంగీతదర్శకుడు. సూపర్భ్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు. ముఖ్యంగా సినిమాలోని ఎమోషనల్‌ సీన్స్‌లో గుణ ఇచ్చిన మ్యూజిక్‌ ఈ సన్నివేశాలను నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లింది. ఎమోషనల్‌ సీన్స్‌కు బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ ఇంపార్టెంట్‌. ఈ విషయంలో గుణ సక్సెస్‌ అయ్యారు. డీఓపీ సురేష్‌గారు బాగా తీశారు. నిజానికి మేం లిఫ్ట్‌ సీన్స్‌ కోసం పెద్ద సెట్‌ వేయలేదు. నార్మల్ లిఫ్ట్ అంత‌ సెట్‌ వేశాం. అయినా సరే సురేష్‌గారు విజు వల్స్‌ను అద్భుతంగా తీశారు. బేబీ డెలివరీ సన్నివేశాల్లో సురేష్ గారు కెమెరాను ఎడ్జెట్‌ చేసిన తీరు కరెక్ట్‌గా సరిపో యింది. థ్యాంక్యూ…బ్రదర్‌ సినిమాకు టెక్నికల్‌గా కూడా మంచి పేరు వస్తుందంటే దానికి కారణం మా సాంకేతిక చిత్ర బృందమే.

మీ నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌!
– రెండు సినిమాలు షూటింగ్‌ ప్రాసెస్‌లో ఉన్నాయి. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా షూటింగ్స్‌ ఆగిపోయాయి. ఈ సినిమాల వివరాలను త్వరలో వెల్లడిస్తాను.

కరోనా సెకండ్‌ వేవ్‌ గురించి ఏం చెబుతారు?
– కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. నాకు తెలిసిన వారిలో కూడా చాలామంది కరోన బారిన పడ్డారు. మనకు కరోన సోకనంత వరకు మనం లైట్‌గానే తీసుకుంటాము. దీనికి నేను కూడా మినహాయింపు కాదు. కానీ ఇలా ఉండటం సరైంది కాదు. కరోనా చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది. దయచేసి ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. కరోనా జాగ్రత్తలను పాటించండి. కాస్త లక్షణాలు కనిపించిన వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలి. కొంచెం పాజిటివ్‌ రిజల్ట్‌ వచ్చిన వెంటనే హోం ఐసోలేషన్‌లోకి వెళ్లాలి. ఇది మనకే కాదు..మన తోటి వారికి కూడా మేలు చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here