డ‌బ్బింగ్ షురూ చేసిన ‘వ‌కీల్ సాబ్’…వీడియో వైర‌ల్‌

0
350

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ `వకీల్‌సాబ్`‌. వేణు శ్రీరామ్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వ‌ర క్రియేష‌న్స్, బోనీ క‌పూర్ ఫిలిమ్స్ ప‌తాకాల‌పై ప్ర‌ముఖ నిర్మాత‌లు దిల్ రాజు, బోనీక‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా
ప్రేక్ష‌కుల ముందుకురాబోతుంది.

ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్టిన టీమ్ ఈ రోజు మరో క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. వ‌కీల్‌సాబ్ కోసం డ‌బ్బింగ్ మొద‌లుపెట్టారు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. ఆ వీడియో, స్టిల్స్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్‌. డ‌బ్బింగ్ థియేట‌ర్‌లో ప‌వ‌న్‌ డ‌బ్బింగ్ చెబుతున్న స్టిల్స్, వీడియో నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

ఈ మూవీలో శృతిహాస‌న్, నివేదా థామ‌స్‌, అంజ‌లి ఫీమేల్ లీడ్ రోల్స్ లో న‌టిస్తున్నారు. ఈ చిత్రం నుంచి విడుద‌లైన పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. ఎస్ థ‌మ‌న్ కంపోజ్ చేసిన పాట‌లు మ్యూజిక్ ల‌వ‌ర్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here