ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో వరస విజయాలు అందుకుంటున్న బన్నీ వాసు నిర్మాతగా ఎనర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్న చిత్రం మా ర్చి19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అదిరిపోయే కామెడీ సీన్స్.. అద్భుతమైన ఎమోషన్.. మంచి కథతో అన్ని కమర్షియల్ హంగులు అద్దుకున్న ట్రైలర్ యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. ఇటీవల హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన జ్యూక్ బాక్స్ విడుదల కార్యక్రమంలో మొదటి టికెట్‌ను ఆవిష్కరించారు ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “భర్త చనిపోయిన అమ్మాయితో ప్రేమాయణం సాగించే ఓ యువకుడి ప్రేమకథ ఇది. దర్శకుడు కౌశిక్ కి ఎంత వెటకారం ఉంటే ఇలాంటి టైటిల్ పెడతాడు? నాకే వెటకారం అంటే నా చుట్టూ చేరేవాళ్లు కూడా అలాగే తయారవుతున్నారనిపిస్తుంది. కార్తికేయ యాక్టింగ్ చూసినప్పుడే అతనితో మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. కార్తికేయ చక్కటి నటనను కనబరిచాడు. ఆద్యంతం సహజంగా సాగుతూ సరికొత్త అనుభూతిని పంచే చిత్రమిది. అన్ని పాటలు కలిపి చూడటం ఇదే మొదటిసారి. కార్తికేయ డ్యాన్స్ అదరగొట్టాడు. హీరో తల్లిగా ఆమని పర్ఫెక్ట్‌గా యాప్ట్ అయ్యారు“ అని అన్నారు.
నిర్మాత బన్నీవాస్ మాట్లాడుతూ – ‘కొత్త జనరేషన్ సరికొత్త కథల్ని ఎంచుకుంటూ మంచి సినిమాలు చేస్తున్నారు. ఆ కోవలో నిలిచే చిత్రమిది. మాస్ క్యారెక్టర్స్‌తో క్లాస్‌గా సాగుతూ మనసుల్ని హత్తుకుంటుంది. అన్నారు
చిత్ర దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి మాట్లాడుతూ – ఇప్పటికే చావు కబురు చల్లగా చిత్రం నుంచి విడుదల చేసిన పబ్లిసిటీ కంటెంట్ కు అనూహ్య స్పందన వస్తుంది. మాస్ అభిమానుల అంచనాలకు తగ్గట్లుగానే ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఇందులో సీనియర్ నటీనటులు అంతా చక్కగా నటించారు. చావు కబురు చల్లగా మార్చి 19న భారీ స్థాయిలో విడుదల కాబోతుంది` అన్నారు.
హీరో కార్తికేయ మాట్లాడుతూ – హీరోగా కెరీర్ తొలినాళ్లలోనే గీతా ఆర్ట్స్‌లో సినిమా చేయడం భరోసానిచ్చింది. నానికి ‘భలే భలే మగాడివోయ్’, విజయ్ దేవరకొండకు ‘గీత గోవిందం’ మాదిరిగా ఈ సినిమా నాకు గొప్ప పేరు తీసుకొస్తుందనే నమ్మకముంది. బాలరాజు లాంటి పాత్రలు అరుదుగా లభిస్తాయి. సినిమాల పరంగా నేను చేసిన తప్పుల్ని తెలియజెప్పిన చిత్రమిది. భవిష్యత్తులో కథాంశాల ఎంపికలో ఆ పొరపాట్లను పునరావృతం చేయకుండా జాగ్రత్తపడతా“ అన్నారు.
హీరోయిన్ లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ – ‘గీతా ఆర్ట్స్‌లో నేను చేస్తోన్న మూడో సినిమా ఇది. కెరీర్‌లో ఇప్పటివరకు నేను విన్న గొప్ప కథగా భావిస్తున్నా’ అన్నారు.



